»   » అఖిల్ కథ మళ్లీ మొదటికే? వంశీ పైడిపల్లి తప్పుకున్నాడా? రీజన్ ఏంటి?

అఖిల్ కథ మళ్లీ మొదటికే? వంశీ పైడిపల్లి తప్పుకున్నాడా? రీజన్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున రెండో కుమారుడు అఖిల్ తన తొలి చిత్రం 'అఖిల్' డిజాస్టర్ కావటంతో రెండో చిత్రం విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని, ఏదీ ఇప్పటివరకూ మొదలుపెట్టలేదు. అప్పటికీ నాగార్జున తనే ఈ సారి అన్ని దగ్గరుండి చూసుకుందామని తనతో ఊపిరి వంటి హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి కు ఆ భాధ్యత అప్పచెప్పాడు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి ...నో చెప్పి ప్రక్కకు తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాగార్జున ..బాలీవుడ్ చిత్రం యే జవాని హై దీవాని ని అఖిల్ తో రీమేక్ చేయాలని, వంశీ పైడిపల్లిని ఆ పనిలో ఉండమని చెప్పారట. అయితే వంశీ పైడిపల్లి మొదటి ఓకే అన్నా తర్వాత... వరసగా రీమేక్ లు చేస్తే ...తనపై రీమేక్ లు మాత్రమే డీల్ చేయగలడనే ముద్ర పడుతుందని భావించి వద్దనుకున్నాడట.

Vamsi Paidipally backs out of Akhil's film?

దాంతో తను సొంతంగా ఓ కథ తయారు చేసుకుని అఖిల్ తో ముందుకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారట. కానీ నాగార్జున మాత్రం బాలీవుడ్ రీమేక్ నే చేసి హిట్ కొట్టాలనే ఉన్నారట. ఈ నేపధ్యంలో వంశీ పైడిపల్లి ఆ క్యాంప్ నుంచి బయిటకు వచ్చి ఎన్టీఆర్ తో కానీ రామ్ చరణ్ తో కానీ ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. గతంలో ఈ ఇద్దరు హీరోలతో బృందావనం, ఎవడు హిట్ కొట్టి ఉన్నాడు. మరి నాగార్డున ఏమంటారో చూడాలి.

English summary
Director Vamsi Paidipally doesn’t want to stick to remakes as it would hamper his growth as the filmmaker. He is said to have backed off Akhil's film and is now planning another film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu