»   » ముందు అది రిలీజ్ చేయండి...మిగతావి తర్వాత

ముందు అది రిలీజ్ చేయండి...మిగతావి తర్వాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వంశీ తన హిట్ చిత్రాలకు సీక్వెల్స్ రెడీ చేసుకుంటూ కూర్చున్నారు. తాజాగా ఆయన 'ఏప్రియల్ 1 విడుదల'చిత్రానికి సీక్వెల్ కథ రెడీ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే సంగీత దర్శకుడు చక్రి ఈ మేరకు సంగీతం రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మధ్యన లేడీస్ టైలర్ చిత్రం సీక్వెల్ సైతం వంశి చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. ఇక ఆయన ఆయన దర్శకత్వంలో తెరకెక్కి విడుదల కోసం ఎదురుచూస్తున్న చిత్రం 'తను మొన్నే వెళ్లిపోయింది'. చిత్రం బిజినెస్ కాక రిలీజ్ ఆగిపోయిందని సమాచారం. ముందు ఆ చిత్రం విడుదల సంగతి చూస్తే..మిగతా వాటి విషయం తర్వాత చూసుకోవచ్చు అంటున్నారు. అజ్మల్‌, నిఖితా నారాయణ్‌ జంటగా నటించారు. పూర్ణనాయుడు నిర్మాత.

'తను మొన్నే వెళ్లిపోయింది' చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... ఎదుటివారికి సాయపడటంలోనే తన ఆనందాన్ని వెదుక్కొనే యువకుడు సుశీల్‌. చదువులు పూర్తి చేసుకొన్నాడు. అందుకే ఇంట్లోవాళ్లు ఓ పెళ్లి సంబంధం చూశారు. సిగ్గులు ఒలకబోస్తూ పెళ్లింట్లో అందంగా ముస్తాబై కూర్చుంది సత్య. కాబోయే దంపతులు ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొన్నారు. మనసు విప్పి మాట్లాడుకొన్నారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఓ అమ్మాయిని వెదికేందుకు ప్రయాణం కట్టారు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఈ జంటకీ, ఆ అమ్మాయికీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

 Vamsi plans a sequel of his hit film

నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ..''వంశీ శైలిలో సాగే చిత్రమిది. త్వరలో పాటలు విడుదల చేస్తాము. వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది. మూడు రోజుల షూటింగ్ మిగిలుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కథకు తగ్గట్టు టైటిల్ పెట్టాం. వంశీ మార్కు సినిమా. చక్రి మంచి స్వరాలందించారు''అన్నారు.

వంశీ మాట్లాడుతూ ''ఒక యువతి కోసం సుశీల్‌, సత్య అనే పెళ్లి కుదిరిన జంట సాగించే అన్వేషణ ఈ కథ. అసలు ఆమె కోసం ఆ ఇద్దరూ వెదకడం... ఆ క్రమంలో కథలో వచ్చే మలుపులు ప్రేక్షకుల్ని ఉత్కంఠపరుస్తాయి. వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమా కోసం సిద్ధం చేసిన ప్రచార పత్రికలకు సామాజిక వెబ్‌సైట్ల మంచి స్పందన వచ్చింది'' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్వీ రఘు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: వేమూరి సత్యనారాయణ, ఎడిటింగ్: బస్వాపైడిరెడ్డి, సంగీతం: చక్రి.


English summary
Ace director Vamsi is planning a sequel to ‘April 1 Vidudala’ film. Music director Chakri has revealed the news and said that he will be providing the music for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu