For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Blakrishna: రియల్ లైఫ్ లో బాలయ్యను 'డాడీ' అని పిలుస్తున్న హీరోయిన్.. సెట్లో మాత్రం అలా

  |

  నందమూరి నటసింహం బాలయ్య బాబు సినిమాలు, టాక్ షోలతో ఫుల్ బిజీగీ ఉన్నారు. నటనలో ఉగ్రరూపం చూపించే బాలకృష్ణతో నిజ జీవితంలో మాట్లాడాలంటే చాలా మంది భయపడతారు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ల నుంచి టెక్నీషియన్స్, నటీనటులు బాలకృష్ణను చూసి జంకుతుంటారు. ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంటారో అని కంగారుపడుతుంటారు. అందుకు అనేక సందర్భాలు కూడా ఉన్నాయి. పబ్లిక్ లె చంప చెల్లు మనిపించడం, ఫోన్ తీసి విసిరేయడం వంటి చాలానే చేశారు బాలకృష్ణ. అయితే అన్ స్టాపబుల్ టాక్ షో వచ్చాక బాలయ్యపై ఉన్న నెగెటివిటీ అంతా పోయిందనే చెప్పాలి. ఆయన్ను అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం బాలకృష్ణతో బాండింగ్ ను అసలు వదులుకోరు. ప్రస్తుతం అలా బంధాన్ని కొనసాగిస్తోంది పాపులర్ హీరోయిన్.

  సింహా అనే సెంటిమెంట్ తో..

  సింహా అనే సెంటిమెంట్ తో..

  ఇటీవల అఖండ చిత్రంతో మాసీవ్ హిట్ అందుకున్న నందమూరి బాలయ్య బాబు హీరోగా క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాలకృష్ణకు సింహా అనే సెంటిమెంట్ గా వర్కౌట్ అయ్యేలా టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.

   వీర సింహారెడ్డిగా టైటిల్..

  వీర సింహారెడ్డిగా టైటిల్..


  నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబో మూవీ NBK107కు వీర సింహారెడ్డి అని టైటిల్ ఖరారు చేశారు. అక్టోబర్ 21న కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద అభిమానుల సమక్షంలో ఈ టైటిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.

  స్పెషల్ సాంగ్ లో చంద్రికా రావు..

  స్పెషల్ సాంగ్ లో చంద్రికా రావు..

  ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తుండగా, దునియా విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరలు మరో కీలక పాత్రల్లో అలరించనున్నారు. అలాగే మలయాళ భామ హనీ రోజ్ టిపికల్ తెలుగు అమ్మాయిగా కనిపించనుందని టాక్. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రావు స్పెషల్ సాంగ్ లో నర్తించనుంది.

  సిస్టర్ సెంటిమెంట్ కు ప్రాధాన్యత..

  సిస్టర్ సెంటిమెంట్ కు ప్రాధాన్యత..

  అయితే ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఉండగా ఆ క్యారెక్టర్ లో బాలకృష్ణకు చెల్లెలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. బాలకృష్ణ, వరలక్ష్మీ నటించిడం ఇదే తొలిసారి అయినప్పటికీ మంచి అనుబంధం ఏర్పర్చుకుందట వరలక్ష్మీ. కెమెరా ముందు క్యారెక్టర్ కు తగినట్లుగా బాలయ్యను 'అన్నా' అని పిలుస్తున్న వరలక్ష్మీ.. ఆఫ్ స్క్రీన్ మాత్రం 'డాడీ' అంటోందట.

  బాలయ్య బాబు కూడా..

  బాలయ్య బాబు కూడా..


  డాడీ అనుకుంటూ చిన్న పిల్లలా బాలకృష్ణ చుట్టూ తిరుగుతుందట వరలక్ష్మీ శరత్ కుమార్. బాలయ్య బాబు కూడా ఆమెను కూతురిలా ట్రీట్ చేస్తున్నారని టాక్. సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఇద్దరు కలిసి మంచిగా కబుర్లు చెప్పుకోవడం, కలిసి భోజనం చేయడం వంటివి చేస్తున్నారట. వీరిద్దరి అనుబంధాన్ని చూసి మిగతా వారంతా ఆశ్చర్యపోతున్నారని సమాచారం.

  డాడీ అంటూ వదలట్లేదని..

  డాడీ అంటూ వదలట్లేదని..


  కాగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ సినిమా సెట్స్ లో కూడా ఎవరితో కలుపుగోలుగా ఉండేది కాదని వినికిడి. ఇప్పుడు బాలకృష్ణను మాత్రం డాడీ అంటూ అస్సలు వదలట్లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

  English summary
  Kollywood Actress Varalaxmi Sarathkumar Calling Nandamuri Balakrishna As Daddy In Gopichand Malineni NBK 107 Veera Simha Reddy Movie Sets.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X