For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లక్కీ ఛాన్స్ కొట్టేసిన వర్షిణి.. ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో క్రుషియల్ రోల్!

  |

  యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో, బుల్లితెరపై చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయిన ఆమె బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలతోనే బాగా ఫేమస్ అయింది. నిజానికి ఆమె ముందే ఒక సినిమాలో నటించినా ఆమెకు లక్ కలిసి రాలేదు. అయితే ఏకంగా ఆమె ఒక పాన్ ఇండియా సినిమా ఆఫర్ పట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  Anchor Ravi - Varshini Romance Promo Goes Viral || Filmibeat Telugu
  యాంకర్ గా క్రేజ్

  యాంకర్ గా క్రేజ్

  పటాస్, ఢీ వంటి షోలతో వర్షిణి ఫుల్ ఫేమస్ అయిందన్న సంగతి తెలిసిందే. నెమ్మదిగా బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా ఎదిగేసింది వర్షిణి. మధ్యలో హైపర్ ఆదితో కుదిరిన కెమిస్ట్రీతో మరింత వైరల్ అయింది. ఢీ 12వ సీజన్‌లో హైపర్ ఆది వర్షిణి టీం లీడర్లుగా ఒకే గ్రూపులో ఉండేవారు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుండడంతో రకరకాల వార్తలు వచ్చేవి. తాను, ఆది మంచి స్నేహితులమేనని ఆమె చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది.


  యాక్సిడెంట్ గురించి నోరు విప్పిన యషికా.. ఆమె అందుకే చనిపోయింది, అసలు ఏమైందంటే?

  పటాస్ తో క్రేజ్

  పటాస్ తో క్రేజ్

  ఇక ఒకప్పుడు పటాస్ షోను శ్రీముఖి రవి కలిసి బాగానే కండక్ట్ చేసేవారు. ఈ షో మంచి పీక్స్‌లో ఉండగానే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి వెళ్లింది. అలా శ్రీముఖి వెళ్లడంతో ఆ ప్లేస్‌లో వర్షిణి ఎంట్రీ ఇచ్చింది. అలా వర్షిణి వచ్చాక పటాస్ షో మరింత క్లిక్ అయింది. వర్షిణి రవి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. కానీ అనుకోకుండా ఆ షో నిలిపివేశారు.

  ప్యాన్ ఇండియా సినిమాలో

  ప్యాన్ ఇండియా సినిమాలో

  ఇక ఈ భామ ఇప్పుడు కొన్ని షోలతో బిజీగా ఉంది. అయితే ఆమె ఒక బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు గుణశేఖర్, తదుపరి చిత్రం శాకుంతలము సినిమాలో సమంతా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి నటించే అవకాశం దక్కించుకుందని అంటున్నారు.

  భార్యకు ముద్దు పెడుతూ నితిన్ విషెస్.. అద్భుతంగా మార్చినందుకు థాంక్స్ అంటూ!

  షూట్ కూడా

  షూట్ కూడా


  తాజాగా నటి వర్షిణి షూట్ లో కూడా పాల్గొందని అంటున్నారు. తనకు ఇలాంటి అవకాశం లభించినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. వేసవిలో ఈ పాత్ర కోసం తనని పిలిచి లుక్ టెస్ట్ తీసుకున్నారని, దర్శకుడికి ఓకే అవ్వడంతో వెంటనే సినిమాలోకి తీసుకున్నారని అన్నారు. ఇక తన పాత్ర గురించి వివరాలను వెల్లడించడానికి ఆమెకు ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇప్పటికే తన పాత్ర కోసం చిత్రీకరణ ప్రారంభించానని వెల్లడించింది.

  సంతోషంగా ఉంది

  సంతోషంగా ఉంది

  ఇక గుణశేఖర్ గుల్ లాంటి వ్యక్తి కింద పనిచేయడం గొప్ప అనుభవం అని ఆమె పేర్కొన్నారు. సెట్స్‌లో తన మొదటి రోజున, నటి సమంతాతో స్క్రీన్‌ను పంచుకోవలసి వచ్చినందున కొంత టెన్షన్ పడ్డానని, అయితే సమంతతో పని చేయబోతున్న క్రమంలో చాలా ఆననందంగా ఉందని వెల్లడించారు.ఈ సినిమాలో కాకుండా రొమాంటిక్ ఎంటర్టైనర్ "మళ్ళీ మొదలైంది" సినిమాలో సుమంత్ భార్యగా కనిపించబోతోంది.

  English summary
  The next movie of filmmaker Gunasekhar-Samantha's ShakunTalam made news again. Actress Varshini Sounderajan has bagged offer in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X