భార్యకు ముద్దు పెడుతూ నితిన్ విషెస్.. అద్భుతంగా మార్చినందుకు థాంక్స్ అంటూ!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రెడ్డి కరోనా సమయంలో తన ప్రియురాలు షాలినితో ఏడడుగులు వేశారు. గతేడాది జూలై 26న అంటే సరిగ్గా ఇదే రోజున కరోనా కారణంగా కొద్దిమంది అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. నేటితో వారి వివాహ బంధానికి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో నితిన్ సోషల్ మీడియా ద్వారా తన ప్రియమైన భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
భార్య షాలినితో కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేసి " ఎవరితో అయితే నేను జీవితాంతం గడపాలని కోరుకుంటున్నానో వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు... నా జీవితాన్ని సులభతరం చేసినందుకు, అద్భుతంగా మార్చినందుకు ధన్యవాదాలు" అంటూ భార్య మీద నితిన్ ప్రేమని వ్యక్తం చేశారు.
ఇక ఈ పిక్ లో నితిన్ తన భార్యను కౌగిలించుకుని ఆమెకు ముద్దు పెడుతున్నాడు. ఇక నితిన్ ఈ పిక్ అలా షేర్ చేశాడో లేదో వెంటనే ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక సినిమాల విషయానికి వస్తే చివరిగా భీష్మ సినిమాతో హిట్ కొట్టిన నితిన్ ఆ తర్వాత మరో సినిమా హిట్ కొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన రెండు సినిమాలు భారీగా నిరాశ పరిచాయి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేయగా ఆ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా రంగ్ దే కూడా కలిసి రాలేదు. ప్రస్తుతం ఆయన హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అందాధున్ సినిమా రీమేక్ మాస్ట్రోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆగష్టు 15న డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ఇక ఆయన ఈ సినిమా కాకుండా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఆయన పవర్ పేట అనే సినిమా చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











