»   »  ప్రేయసితో వరుణ్ సందేశ్ పెళ్లి: మంచు లక్ష్మి వద్ద బయటపడ్డాడు

ప్రేయసితో వరుణ్ సందేశ్ పెళ్లి: మంచు లక్ష్మి వద్ద బయటపడ్డాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా హీరో వరుణ్ సందేశ్ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆమె ఎవరనేది మాత్రం అతను చెప్పడం లేదు. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న అతను మంచు లక్ష్మి వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆ విషయం చెప్పాడు. ఆమె ఎవరనేది మాత్రం అతను చెప్పలేదు.

ఆమె ఎవరని అడిగితే ముసిముసిగా నవ్వుతూ సమాధానం దాటవేశాడు. ఆ కుర్ర హీరోను ఇబ్బంది పెట్టడం ఎందుకని లక్ష్మి మంచు కూడా దాంతో వదిలేసింది. ప్రేమలో పీకల్లోతు మునిగిపోవడం వల్లనే వరుణ్ సందేశ్ ఎక్కువగా సినిమాలు చేయడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Varun Sandesh to marry his fiance

వరుణ్ సందేశ్ ఓ తమిళ హీరోయిన్‌తో ప్రేమలో పడినట్లు ప్రచారం సాగుతోంది. ఆమె ఎవరనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఆమెతో కలిసి తెలుగులో వరణ్ సందేశ్ రెండు సినిమాలు కూడా చేసినట్లు చెబుతున్నారు.

ఇరు కుటుంబాలవారికి విషయం తెలిసిందని, వారు పెళ్లికి అంగీకరించారని కూడా వరుణ్ సందేశ్ చెప్పాడు. పెద్దల అంగీకారంతో త్వరలో నిశ్చితార్థం చేయనున్నట్లు తెలిసింది. ఆ మధ్య శ్రద్ధాదాస్‌తో కొద్దికాలం డేటింగ్‌ కూడా చేశాడనే రూమర్లు వ్యాపించారు. ఏమంయిదోకానీ.. ఇద్దరూ దూరమయ్యారు. నిజం చెప్పాలంటే, వరుణ్ సందేశ్ హెయిర్ స్టయిల్ కూడా మారిపోయింది. అందుకు కారణం కూడా అతని ప్రేయసియే అని అంటున్నారు.

English summary
Telugu film hero Varun Sandesh will marry his fiancee soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu