»   » నాగబాబు కొడుకు హీరోయిన్ మారింది

నాగబాబు కొడుకు హీరోయిన్ మారింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ హీరోగా ఓ చిత్రం మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అక్షర గౌడను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిముషాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రేస్ లోకి పూజా హేగ్డే వచ్చి చేరింది. సినిమాకి 'గొల్లభామ' అనే పేరుని పరిశీలిస్తున్నారు.

ఇటీవల చిత్రబృందం ఆ వివరాలు ప్రకటించింది. ఈ సినిమాకి వచ్చే నెల 27న కొబ్బరికాయ కొట్టనున్నారనేది తాజా సమాచారం. వరుణ్‌ సరసన పూజా హెగ్డేని ఎంపిక చేశారు. లియో ప్రొడక్షన్స్‌ పతాకంపై సినిమా రూపొందబోతోంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకునిగా వ్యవహరిస్తున్న దీనికి ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు. గోదావరి అందాల నడుమ సాగే చక్కటి ప్రేమకథగా సినిమా ఉండబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి.

Varun Tej-Pooja Hedge

'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడీ దర్శకుడు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ చిత్రానికి ఠాగూర్‌ మధు, నల్లమలపు శ్రీనివాస్‌ నిర్మాతలు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.

.2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. నాగబాబు కొడుకుకి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్ ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడట.

English summary
Naga Babu's son Varuntej's debut film is all set to go to sets from 27th Feb at Annapurna Studios. According to the latest filmmakers changed the heroine in the last minute. They settled for Pooja Hegde, earlier there was a talk of Akshara Gowd being confirmed in the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu