For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెరపై 'థౌజండ్ వాలా' పేలాల్సిందే: అజ్ఞాతవాసిలో మరో అజ్ఞాతవాసి.. ఊహించని గెటప్‌లో

  |
  అజ్ఞాతవాసిలో మరో అజ్ఞాతవాసి.. ఊహించని గెటప్‌లో టాప్ హీరో !

  ప్రతీ పాటకు మీటర్ ఉన్నట్లే.. సంభాషణలకూ మీటర్ ఉంటుంది. ఆ మీటర్ పాటకు వినసొంపును తీసుకొస్తే.. సంభాషణకు ఆకట్టుకునే తత్వాన్ని తీసుకొస్తుంది. డైలాగ్ పేల్చడంలో నటుడి టైమింగ్.. మీటర్.. రెండూ సరిగ్గా సరిపోయినప్పుడే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.

  అలా త్రివిక్రమ్ రాసిన సంభాషణలను తెరపై కామెడీ రూపంలో అద్భుతంగా పేల్చారు వెంకటేష్. త్రివిక్రమ్ డైలాగ్ లోని మీటరును వెంకీ, వెంకీలోని హాస్యాన్ని త్రివిక్రమ్ పర్ఫెక్ట్‌గా పట్టుకోగలిగారు కాబట్టే.. ఈ ఇద్దరి కాంబినేషన్ సూపర్ హిట్‌గా నిలిచింది.

  అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

  ఇప్పుడిదంతా ఎందుకంటే.. చాన్నాళ్ల తర్వాత వీరిద్దరి మ్యాజిక్ మరోసారి వెండితెరపై చూడబోతున్నాం కాబట్టి. ఆ విశేషాలు మీకోసం.

  అతిథి పాత్రలో:

  అతిథి పాత్రలో:

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక అతిథి పాత్రలో మెరుస్తారట. వెంకీ కనిపించే ఎపిసోడ్ మొత్తం ఫన్నీగా, పంచ్ డైలాగులతో సాగిపోయే విధంగా తీర్చిదిద్దారట త్రివిక్రమ్.

  మేనమామగా వెంకీ?:

  మేనమామగా వెంకీ?:

  అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ పవన్ కు 'మేనమామ'గా నటిస్తున్నాడన్నది ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. పవన్, వెంకీ ఇద్దరూ చూడటానికి అన్నదమ్ముల్లా కనిపిస్తారు. అలాంటిది పవన్ మేనమామగా వెంకటేష్ ను సెట్ చేయడంలో తివిక్రమ్ ఆంతర్యం ఏంటో అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

   త్రివిక్రమ్-వెంకీ మార్క్:

  త్రివిక్రమ్-వెంకీ మార్క్:

  వెంకీ పవన్‌కు మేనమామ ఏంటి అని చాలామందికి అనిపించవచ్చు. కానీ వెంకీలోని హాస్యాన్ని పట్టుకోవడంలో త్రివిక్రమ్ ధిట్ట. నువ్వు నాకు నచ్చావ్.. మల్లీశ్వరి సినిమాల్లో అది ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కాబట్టి మరోసారి వెంకీలోని కామెడీ యాంగిల్‌ను పట్టుకుని మేనమామ పాత్రకు సరిపోయే విధంగా పాత్రను తీర్చిదిద్దారట త్రివిక్రమ్. వీరిద్దరి మార్క్‌తో తెరపై కామెడీ పంచ్‌లు 'థౌజండ్ వాలా'లా పేలుతాయంటున్నారు.

   కొత్త గెటప్‌లో వెంకీ:

  కొత్త గెటప్‌లో వెంకీ:

  పవన్ కు మేనమామ అంటే కాస్త వయసు మీద పడినట్లు కనపడాలి కాబట్టి.. అందుకు కూడా వెనకాడలేదట వెంకీ. త్రివిక్రమ్ చెప్పగానే.. కాస్త తెల్ల వెంట్రుకలు కనిపించేలా మేకప్ చేసుకుని నటించేశారట. సినిమాలో తెల్ల మీసాలు, తెల్ల జుట్టులో ఓ కొత్త గెటప్ లో వెంకీని చూస్తారన్న ప్రచారం జరుగుతోంది.

   'వెంకీ' మరో అజ్ఞాతవాసి:

  'వెంకీ' మరో అజ్ఞాతవాసి:

  అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ పాత్రపై ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఈ పాత్ర గురించి ఎక్కడా రివీల్ చేయకుండా.. తెరపైనే సర్‌ప్రైజ్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఈ లెక్కన పవన్ సినిమాలో వెంకీ మరో 'అజ్ఞాతవాసి' అనే అనుకోవచ్చా!.

  వెంకీ.. గ్రేట్:

  వెంకీ.. గ్రేట్:

  ఇండస్ట్రీలో మిగతా హీరోలకు వెంకీ నిజంగా భిన్నమనే చెప్పాలి. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా.. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనూ ఆయన నటించారు. తనపై తానే సెటైర్స్ వేసుకుని మెప్పించారు. తెరపై కామెడీని, విషాదాన్ని పండించడంలో వెంకీ మాస్టర్ పీస్.

  అంతేకాదు, ఇప్పటి తరం హీరోలతోనూ జతకట్టడానికి ఆయన ఏమాత్రం వెనుకాడరు. కాబట్టే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల లాంటి మల్టీ స్లారర్స్ ఆనవాయితీ మళ్లీ మొదలైంది. ఇప్పుడు పవన్ కు మేనమామగా నటిస్తూ.. మరోసారి నటుడిగా తనకెలాంటి పరిధులు లేవని నిరూపించుకుంటున్నారు వెంకీ.

  English summary
  Pawan and Venki were seen together for Gopala Gopala film where Venkatesh is having good relations with Pawan from then.So now it can be assumed Venkatesh as another Agnathavasi in the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X