Just In
- 30 min ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 1 hr ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 1 hr ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 3 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- News
ఏపీలో కరోనా: కొత్తగా 172 కేసులు -ఒకరి మృతి -టీకాల పంపిణీపై కేంద్రాకి జగన్ సర్కారు లేఖ
- Sports
36 పరుగులకు ఆలౌట్ అవ్వగానే.. గంగూలీ నుంచి కాల్ వచ్చింది: రహానే
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘క్రాక్’ సినిమా చేయాల్సింది రవితేజ కాదు.. మంచి ఛాన్స్ మిస్సైన స్టార్ హీరో
'డాన్ శ్రీను', 'బలుపు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని - మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'క్రాక్'. కొన్ని సమస్యల నడుమ గత వారం విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని సంక్రాంతి సీజన్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో విపరీతమైన స్పందనను దక్కించుకుని అదరగొట్టేసింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులుపుతూ రవితేజ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ను కలెక్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హౌస్‌ఫుల్ షోలతో సత్తా చాటుతోంది.
'క్రాక్' సినిమా విజయం సాధించిన తర్వాత ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం రవితేజ కంటే ముందు దర్శకుడు గోపీచంద్ మలినేని సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ను సంప్రదించాడట. అయితే, అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమాను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో గోపీచంద్.. తనకు అత్యంత సన్నిహితులైన మాస్ మహారాజాను సంప్రదించాడట. కాప్ స్టోరీ కావడంతో పాటు మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో ఆయన వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వెంకటేష్ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో 'బాడీ గార్డ్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

గత ఏడాది 'డిస్కో రాజా' వంటి డిజాస్టర్ మూవీతో వచ్చిన రవితేజ.. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. శృతీ హాసన్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మించారు. ఇందులో సముద్రఖని, రవి శంకర్‌తో పాటు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నెగెటివ్ రోల్స్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు.