»   » 'డైమండ్ రాజా' గా వెంకటేష్

'డైమండ్ రాజా' గా వెంకటేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకటేష్ త్వరలో 'డైమండ్ రాజా' గా కనిపించనున్నారని తెలుస్తోంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ఈ టైటిల్ ని ఫైనలైజ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. మొదట ఈ చిత్రానికి రాధాకృష్ణ అనే టైటిల్ అనుకున్నారు కానీ నిర్మాత మీడియా వద్ద ఖండించారు.

ఇక డైమండ్ రాజా నే కాక రాజా రత్నం, 24 క్యారెట్ బంగారం, బాబు బంగారం, టైటిల్స్ కూడా ఈ చిత్రం టైటిల్స్ గా పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, సురేష్ బాబు ఏ టైటిల్ ఫైనలైజ్ చేస్తే అదే టైటిల్ తో సినిమా మొదలు కానుంది.

చిత్రం విశేషాలకు వస్తే... వెంకటేశ్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం డిసెంబర్‌ 16న ప్రారంభం కానుందని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. ఎస్‌. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Venkatesh new film titled Diamond Raja?

ఈ విషయాన్ని నాగవంశీ తెలియజేస్తూ ‘‘ఇదివరకు ‘లక్ష్మీ', ‘తులసి' చిత్రాలతో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వెంకటేశ్, నయనతార మరోసారి మా చిత్రంలో జంటగా నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇటీవల మారుతి చెప్పిన కథ మాకు, వెంకటేష్ గారికి బాగా నచ్చింది. వారి కాంబినేషన్ సినిమా అనగానే షూటింగ్‌ ప్రారంభానికి ముందుగానే క్రేజ్‌ వచ్చింది.

ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుంది. తెలుగులో ‘రన్ రాజా రన్', ‘జిల్‌' సినిమాలకు పనిచేసిన జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. 2016 వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తాం'' అని చెప్పారు.

జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్‌.వివేక్‌ ఆనంద్‌, కూర్పు: ఉద్దవ్‌, సమర్పణ: ఎస్‌.రాధాకృష్ణ

English summary
Diamond Raja title is being floated around for director Maruthi's new film with Venkatesh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu