»   » పవన్ కు ఇచ్చినట్లే..వెంకీకి పెద్ద హిట్ ఇస్తాడా మరి?

పవన్ కు ఇచ్చినట్లే..వెంకీకి పెద్ద హిట్ ఇస్తాడా మరి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీ దబాంగ్ రైట్స్ తీసుకు వచ్చి గబ్బర్ సింగ్ అంటూ బ్లాక్ బస్ట్రర్ హిట్ కొట్టిన నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు మరో రీమేక్ తో వస్తున్నారు. ‘టూ కంట్రీస్' అనే సూపర్ హిట్ మళయాళ చిత్రం రైట్స్ తీసుకుని మరో హిట్ కు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

అలాగే ఈ సారి ఈ రీమేక్ లో వెంకటేష్ అయితే బాగుంటారని ఆయన్ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెంకటేష్ సైతం ఇప్పటికే ‘టూ కంట్రీస్' గురించి విని ఉండటంతో ఈ రీమేక్ చేయటానికి ఉత్సాహం చూపించే అవకాసం ఉంది.

గతంలో మళయాళంలో పెద్ద హిట్టైన దృశ్యం చిత్రాన్ని వెంకటేష్ రీమేక్ చేసి సూపర్ హిట్ చేసారు. అదే ఊపులో ఈ రీమేక్ కూడా చేస్తే మళ్లీ పాత వెంకటేష్ చిత్రాల స్దాయిలో ఘన విజయం సాధిస్తారని చెప్తున్నారు.

Venkatesh in Two Countries remake?

‘టూ కంట్రీస్' విషయానికి వస్తే..

దిలీప్, మమతా మోహన్ దాస్ జంటగా నటించిన ‘టూ కంట్రీస్' చిత్రం మలయాళంలో సూపర్ హిట్ టాక్‌తో 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. రీసెంట్‌గా ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు నిర్మాత బండ్ల గణేష్. ‘టూ కంట్రీస్' చిత్ర తెలుగు హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'మలయాళ బ్లాక్ బస్టర్ టూ కంట్రీస్ చిత్ర హక్కుల్ని భారీ పోటీ మధ్య దక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం.

అందుకే భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. టాలీవుడ్‌లో ఉన్న టాప్ స్టార్స్ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి తెలియజేస్తాను'. అని అన్నారు.

English summary
Bandla Ganesh apparently keen on casting Venkatesh to reprise Dileep’s role in Two Countries remake .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu