Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఇన్నాళ్ళకు సరైన దర్శకుడికి చిక్కిన వెంకటేష్.. మైత్రి మూవీ మేకర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ చాలాకాలంగా మల్టీస్టరర్ సినిమాలతోనే ఎక్కువగా గుర్తింపుని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సోలో హీరోగా వెంకటేష్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకొని చాలా కాలమైంది. అలాగే వెంకటేష్ ఎక్కువగా రీమేక్ సినిమాలో చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం స్ట్రైట్ సినిమా చేయాలని కొత్త కథలపై చర్చలు జరుపుతున్నాడు. ప్రస్తుతం లిస్టులో అయితే దర్శకులు చాలామంది ఉన్నారు.
కానీ ఎవరి విషయంలోను ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు. ఇంతకుముందు అయితే ఈ నగరానికి ఏమైంది దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పాటు నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమల తో కూడా సినిమాలు చేసేందుకు కొన్ని కథలపై చర్చలు జరిపారు. కానీ ఎందుకో ఆ కాంబినేషన్స్ అయితే సెట్ కాలేదు. అలాగే జాతి రత్నాల దర్శకుడు అనుదీప్ తో కూడా వెంకటేష్ సినిమా చేయవచ్చని ఆ మధ్య ఒక టాక్ వచ్చింది. కానీ అధికారికంగా మాత్రం ఎవరు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

ఇక వెంకటేష్ లేటెస్ట్ గా సక్సెస్ అందుకున్న ఒక కమర్షియల్ టాలెంటెడ్ దర్శకుడి దృష్టిలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ధమాకా సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇటీవల 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న త్రినాధ రావు నక్కిన. రవితేజ కెరీర్ లోనే కాకుండా త్రినాధరావు కెరీర్ లో కూడా అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్న ధమాకా సినిమా వారికి మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ఇక త్రినాధరావుతో సినిమా చేసేందుకు ప్రస్తుతం బడా సంస్థలు కూడా సిద్ధమవుతున్నాయి.
ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ అతనికి అడ్వాన్స్ ఇచ్చి మరి తదుపరి సినిమా తమ ప్రొడక్షన్లోనే చేయాలి అని అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వెంకటేష్ కు ఇటీవల దర్శకుడు త్రినాధరావు ఒక స్టోరీ లైన్ గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది. మంచి ఫన్ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ కావడంతో వెంకీ ఆ కథపై కూడా ఆసక్తి చూపినట్లు టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ గనక సెట్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చే అవకాశం ఉంటుంది. మరి మైత్రి మూవీ పేపర్స్ ఈ కాంబినేషన్ ను ఎప్పుడూ తెరపైకి తీసుకు వస్తుందో చూడాలి.