»   » ఆ దర్శకుడి సినిమా నితిన్‌తో కాదు.. కథ పూర్తయ్యాక పరిస్థితి మారిపోయిందిగా!

ఆ దర్శకుడి సినిమా నితిన్‌తో కాదు.. కథ పూర్తయ్యాక పరిస్థితి మారిపోయిందిగా!

Subscribe to Filmibeat Telugu

నితిన్ ప్రస్తుతం ఛల్ మోహన్ రంగ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. చల్ మోహన్ రంగ చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఏప్రిల్ 5 న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే నితిన్ మరో చిత్రాన్ని ప్రారంభించేసాడు. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుములు దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

Venky Kudumula is not doing film with Nithiin

నితిన్‌తో సినిమా చేసే విషయంలో వెంకీ కుడుములు వెనక్కు తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి కథ సిద్ధం అయ్యాక దర్శకుడు తన ఒపీనియన్ మార్చుకున్నాడట. ఈ కథ నితిన్ కన్నా నిఖిల్ కు సరైన విధంగా ఉంటుందని భావించాడట. దీనితో వెంకీ నిఖిల్ ని కథ వినిపించాడని, నితిన్ తన అంగీకారాన్ని తెలియజేసాడని వార్తలు వస్తున్నాయి. హారిక హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Venky Kudumula is not doing film with Nithiin. He narrated story to Nikhil
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X