»   »  హాస్పటల్ నుంచి ఈ రోజే విద్యాబాలన్‌ ?

హాస్పటల్ నుంచి ఈ రోజే విద్యాబాలన్‌ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ వెన్నునొప్పితో మంగళవారం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే వైద్య పరీక్షల్లో మూత్రపిండంలో రాయితో ఆమె బాధపడుతున్నట్లు తేలింది.

అయితే ఆమెను శుక్రవారం అంటే ఈ రోజు హాస్పటిల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు సమాచారం. విద్యబాగనే రికవరీ అయ్యింది. ఆమె ఆరోగ్యం బాగుంది. ఈ రోజు హాస్పటిల్ నుంచి ఇంటికి పంపే అవకాసం ఉంది. ఇంటి వద్ద కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అని ఆస్పత్రి వర్గాలు మీడియాకు తెలియచేసాయి.

Vidya Balan might be out of hospital on ToDay?

‘హిందుజా ఆసుపత్రి వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్న విద్యాబాలన్‌ త్వరగా కోలుకుంటున్నారు' అని ఆమె అధికారప్రతినిధి తెలిపారు. ‘విద్యాబాలన్‌ జనవరి 1న తన పుట్టినరోజును భర్త సిద్ధార్థ రాయ్‌ కపూర్‌తో కలసి న్యూయార్క్‌లో జరుపుకోవాలనుకున్నారు.

మంగళవారం వారిద్దరు న్యూయార్క్‌ బయల్దేరారు. ముంబయిలోవారివిమానం ఎగరడానికి ముందు ఆమెకు వెన్నునొప్పి వచ్చింది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో సిద్ధార్థ రాయ్‌ ఆమెను హిందుజా ఆసుపత్రిలో చేర్పించారు' అని ప్రతినిధి పేర్కొన్నారు.

English summary
Actress Vidya Balan is likely to get discharged on New Year’s Day on Friday . Vidya is recovering well. She is feeling better. Most probably she will get discharged by today,” said a source close to the actress.
Please Wait while comments are loading...