»   »  అవసరమైతే ఆ హీరో భార్యని చంపుతా!

అవసరమైతే ఆ హీరో భార్యని చంపుతా!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vidya Balan
ఈ మాటలంటున్నది ఎవరో పిచ్చి అమ్మాయో..వీరాభిమానో కాదు ...పేరున్న హీరోయిన్ విద్యా బాలన్. ఆ హీరో షారూఖ్ ఖాన్. ఏమిటి వీరి అనుబంధం అంతదాకా వెళ్ళిదా అనుకుంటున్నారా ...అదేమీ కాదు. ఆమెకు కింగ్ ఖాన్ షారూఖ్ అంటే చిన్నప్పటి నుంచీ పిచ్చ అభిమానంట. దాంతో అతన్ని పొందటం కోసం భార్య గౌరీ ఖాన్ నైనా చంపటానికైనా నేను రెడీ అని ఓ ప్రెవేట్ టీవీ షో లో రీసెంట్ గా ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది. మరి గొడవలు కాలేదా అంటారా ...ఇదంతా ఆమె లైటర్ వీన్ లో కామిడీగా చెప్పిందిట. షారూఖ్ తన కలల రాకుమారుడు అని,గౌరీ తో అతనికి పెళ్ళవటం తనని భాదిస్తోందని చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఆ టీవీ పోగ్రాం పేరు 'సాజిద్ స్ సూపర్ స్టార్స్'. ఇంతకీ ఈ విషయం ఆమె తాజా ప్రియుడు షాహిద్ కపూర్ కి తెలిసే ఉంటుంది కదా అతనెలా స్పందించి ఉంటాడనేది ప్రక్కన పెడితే షారూఖ్ కి పరిశ్రమ బయిటే కాక లోపల కూడా ఈ స్ధాయి అభిమానులు ఉండటం గొప్ప విషయం అని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.ఇక ఈ పోగ్రామ్ టైటిల్ అయిన సాజిద్ స్ సూపర్ స్టార్స్ లో సాజిద్ ఖాన్ తో ఆమెకు సంభంధాలు ఉన్నాయి అని గతంలో గాసిప్స్ రావటం దీనికి కొసమెరుపు. ఇలా చేతిలో మైకు,వినేందుకు ఆడియన్స్ ఉన్నారు కదా అని నోటికొచ్చినట్లు స్టేట్ మెంట్స్ ఇస్తే గాసిప్స్ పుట్టడంలో వింతేముంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X