విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న సీక్రెట్ ఎంగేజ్ మెంట్?.. అలా నేషనల్ క్రష్ లీక్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ఇక మరోసారి వీరి కాంబినేషన్ ఎప్పుడూ సెట్ అవుతుందా? అని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి గురించి తాజాగా షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరు కలిసి 2 చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తొలుత గీతా గోవిందం అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రం వచ్చింది. కానీ ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ఆడియెన్స్ షాక్ అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్లు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదోక వార్త నడుస్తూనే ఉంది.

ఇక తాజాగా వీరిద్దరి గురించి మరో షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న యూఎస్ఏలో ఇండియా డే పరేడ్ కు హాజరైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా హాజరై మళ్లీ జంటగా తిరిగి వచ్చారు. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇద్దరు సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని ఆ రూమర్ సారాంశం. అది కూడా రష్మిక మందన్న దుబాయ్ లో నిర్వహించిన సైమా 2025 అవార్డ్స్ ఫంక్షన్ లో ఎంగేజ్ మెంట్ రింగ్ ను ధరించి కన్ఫమ్ చేసిందని ప్రచారం.
అయితే తాజాగా ముంబైలో రష్మిక మందన్న చక్కర్లు కొడుతున్న సమయంలో తన వేలికి ఎలాంటి రింగు ధరించి లేదు. ఇక తాజాగా పంచుకున్న ఫొటోల్లోనూ కేవలం ఫ్యాషన్ రింగ్ ను కలిగి ఉంది. దీంతో దుబాయ్ సైమా ఈవెంట్ లోనూ జస్ట్ ఫ్యాషన్ రింగ్ ను మాత్రమే రష్మిక మందన్న ధరించి ఉంటుందని తెలుస్తోంది. దీంతో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న సీక్రెట్ ఎంగేజ్ మెంట్ అంటూ వస్తున్న రూమర్లకు అడ్డుకట్ట పడనట్లైంది.
ఇక కెరీర్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ రీసెంట్ గా కింగ్డమ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆశించిన మేర ఫలితాన్ని అందుకో లేకపోయారు. మరోవైపు రష్మిక మందన్న మాత్రం తన కెరీర్ లో దూసుకుపోతోంది. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా వంటి చిత్రాలతో భారీ హిట్స్ అందుకుంది. నెక్ట్స్ ది గర్ల్ ఫ్రెండ్, మైసా అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











