Just In
- 16 min ago
ఒకే రోజు రెండు సినిమాలు.. రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తున్న పవర్ స్టార్
- 30 min ago
‘సత్యమేవ జయతే’.. ‘వకీల్ సాబ్’ పాటపై తమన్ పోస్ట్ వైరల్
- 1 hr ago
ఆయనలో నచ్చింది అదే.. ఇంకెవ్వరిలోనూ చూడలేదు.. ‘తొలిప్రేమ’ వాసుకి కామెంట్స్
- 1 hr ago
మాజీ భర్త గిఫ్టుగా అరుదైన పెయిటింగ్. రికార్డు ధరకు వేలం వేసిన ఎంజెలీనా జోలి
Don't Miss!
- Automobiles
టాటా 'హెచ్బిఎక్స్' కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ ఖరారు; ఈ ఏడాదిలోనే విడుదల!
- News
కోహినూర్ వజ్రంలాంటి పాలమూరు: లంబాడీ వస్త్రధారణలో వైఎస్ షర్మిల: చంద్రబాబుపై సెటైర్లు
- Lifestyle
అతను 30 ఏళ్లుగా వధువు దుస్తుల్లోనే... కారణం తెలిస్తే షాకవుతారు...!
- Finance
ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ముఖేష్ అంబానీ, అమెరికాతో మనోళ్లు పోటీ
- Sports
IPL 2021: ముంబై ఔట్.. హైదరాబాద్ ఇన్!!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ సేతుపతి - ఎన్టీఆర్ కాంబోపై షాకింగ్ న్యూస్.. ఆ డైరెక్టర్ చేతికి చిక్కితే అరాచకమే..
విజయ్ సేతుపతి ఇప్పుడు కేవలం తమిళ నటుడు మాత్రమే కాదు. సౌత్ ఇండియాలో భారీ డిమాండ్ ఉన్న యాక్టర్. స్టార్ హీరోలకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ అంతకంటే హై రేంజ్ లో సేతుపతికి క్రేజ్ పెరుగుతోంది. ఎలాంటి పాత్ర చేసినా కూడా సినిమాపై బజ్ అమాంతంగా పెరిగిపోతోంది. ఇక త్వరలోనే మరో టాలీవుడ్ అగ్ర హీరోతో సేతుపతి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమా నుంచే భారీ డిమాండ్
కేవలం హీరోగానే కాకుండా విలన్ రోల్స్ అలాగే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతున్నాడు ఈ మల్టిటాలెంటెడ్ యాక్టర్. సైరా సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి విజిల్స్ వేయించాడు. ఆ సినిమా నుంచే విజయ్ సేతుపతికి తెలుగులో మరింత డిమాండ్ పెరుగుతూ వస్తోంది.

డేట్స్ అడ్జస్ట్ చేయలేక..
ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. కానీ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా సినిమాలు వదులుకోవాల్సి వస్తోంది. అసలు ఈ రోజుల్లో ఆయన డేట్స్ దొరకడమే అదృష్టం. లక్కీగా ఉప్పెన టీమ్ కు సేతుపతి దొరకడం ఆ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఆ సినిమాలో సింపుల్ గానే భయంకరమైన విలనిజాన్ని చూపించాడు. ఇక మాస్టర్ లో ఏ రేంజ్ లో పెర్ఫెమెన్స్ ఇచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఎన్టీఆర్ సినిమాలో..
ఇక విజయ్ సేతుపతి రానున్న రోజుల్లో మరిన్ని టాలీవుడ్ సినిమాలు చేయనున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చింది. పుష్ప సినిమాలో డేట్స్ కుదరక డ్రాప్ అయిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సినిమాలో మాత్రం విజయ్ సేతుపతి నెగిటివ్ పాత్రలో తప్పకుండా కనిపిస్తాడని రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

త్రివిక్రమ్ చేతికి చిక్కితే..
త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా విజయ్ సేతుపతి కనిపిస్తాడని టాక్ వస్తోంది. త్రివిక్రమ్ లాంటి దర్శకుడి చేతికి ఒక సరైన ఆర్టిస్ట్ దొరికితే ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సేతుపతిని ఊహాలకందని రేంజ్ లో చూపించడం కాయమని చెప్పవచ్చు. చూడాలి మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో..