మహేష్ బాబు కోసం రంగంలోకి విజయ్ సేతుపతి.. గట్టిగా ప్లాన్ చేసిన త్రివిక్రమ్!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని కొద్ది రోజుల క్రితం సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా భాగమవుతున్నారు. నిజానికి చివరిగా మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సముద్రఖని ఒక నెగిటివ్ పాత్రలో నటించారు.

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అలాగే కలెక్షన్స్ విషయంలో భారీగా కలెక్షన్స్ రాబట్టిందని సినిమా యూనిట్ ప్రకటిస్తే ట్రేడ్ వర్గాల వారు మాత్రం కొంతమేర నష్టాలతో బయటపడిందని చెబుతూ ఉంటారు. ఆ విషయంలో అయితే క్లారిటీ లేదు. అయితే ఆ సినిమా పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన తన 28వ సినిమా అని త్రివిక్రమ్ తో చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బానర్లో రూపొందుతున్న ఈ సినిమాను చినబాబు నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో త్రివిక్రమ్ విజయ్ సేతుపతిని విలన్ గా అనుకుంటున్నారని లేదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను విలన్ గా అనుకుంటున్నారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.

Vijay sethupathi to act with mahesh babu in ssmb 28

కానీ తాజాగా మరో విషయం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే అది విలన్ పాత్రనా లేక వేరే పాత్రనా అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ తన పాత్ర విన్న తరువాత తాను నటిస్తున్నానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ బాబు విజయ్ సేతుపతి ఇద్దరూ కూడా ఆగస్టులోనే షూటింగ్ ప్రారంభిస్తారని, మహేష్ బాబుతో కలిసి ఉన్న షెడ్యూల్లో విజయసేతుపతికి కొన్ని కీలక సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X