For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరిలేరు అప్‌డేట్: తన మాటే వినాలని పట్టుబట్టిన విజయశాంతి.. వర్కౌట్ అవుతుందా.!

By Manoj Kumar P
|

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటీమణుల్లో విజయశాంతి ఒకరు. 'కిలాడీ కృష్ణుడు' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే తెలుగులోని అందరు స్టార్ హీరోలతో నటించారు. మొదటి తరం హీరోలతో పాటు సెకెండ్ జనరేషన్‌ వాళ్లతోనూ నటించి మెప్పించారు.

అంతేకాదు, తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన వాళ్లల్లో విజయశాంతి అందరి కంటే ముందుంటారు. ఈమె చేసినన్ని సినిమాలు మరెవరూ చేయలేదు. ఇక, దాదాపు పదమూడేళ్ల క్రితం సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఆమె.. మహేశ్ బాబు సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త.? వివరాల్లో వెళ్తే..

ఆ సినిమా తర్వాత రాజకీయాల్లోకి

ఆ సినిమా తర్వాత రాజకీయాల్లోకి

విజయశాంతి చివరిసారిగా 2006లో వచ్చిన ‘నాయుడమ్మ' అనే సినిమాలో కనిపించారు. ఆ తర్వాత ఆమె మరోసారి మేకప్ వేసుకోలేదు. ఆ సమయంలో విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. కానీ, ఆమె పొలిటికల్ కెరీర్ మాత్రం ఎత్తుపల్లాలతోనే నడుస్తూ వస్తోంది.

సరిలేరు ఆమెకెవ్వరూ అనిపిస్తుందా

సరిలేరు ఆమెకెవ్వరూ అనిపిస్తుందా

చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విజయశాంతి.. సూపర్ స్టార్ మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె పవర్‌ఫుల్ రోల్‌ను చేస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్, స్టిల్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. దీంతో ఈ సినిమాలో ఆమె నటన అదిరిపోతుందని అంటున్నారు.

కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటుకోవాలని

కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటుకోవాలని

‘సరిలేరు నీకెవ్వరు' తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటుకోవాలని చూస్తున్నారు లేడీ అమితాబ్ విజయశాంతి. అందుకోసం ఆమె లుక్కు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇందుకోసం ఆమె రోజుకు ఆరు గంటల చొప్పున జిమ్‌లో కసరత్తులు చేశారని అన్నారు. దాని ఫలితంగానే రాయల్ లుక్‌లోకి వచ్చారట విజయశాంతి.

తన మాటే వినాలన్న విజయశాంతి

తన మాటే వినాలన్న విజయశాంతి

ఇక, ఈ సినిమా విషయంలో విజయశాంతి ప్రవర్తన గురించి ఓ ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో తన పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించడానికి ప్రయత్నించిన చిత్ర యూనిట్‌కు ఆమె షాకిచ్చారట. చాలా కాలం తర్వాత వచ్చినప్పటికీ ప్రేక్షకులు తన గొంతునే వినాలని, అందుకు గానూ తానే డబ్బింగ్ చెప్పుకుంటానని ఆమె అన్నారని టాక్.

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
సరిలేరు నీకెవ్వరు గురించి

సరిలేరు నీకెవ్వరు గురించి

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్‌ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా విజయశాంతి, బండ్ల గణేష్, సంగీత రీఎంట్రీ ఇస్తున్నారు.

English summary
Tollywood Superstar Mahesh Babu New movie is Sarileru Neekevvaru. This Film Directed by Anil Ravipudi. In This Movie Mahesh act as major ajay Krishna. In This Movie Vijayashanti also play key role. In This Film Vijayashanti Own Dubbing.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more