»   »  బాహుబలి ఎఫెక్ట్‌: రజనీకాంత్‌ సినిమాకు డైరెక్షన్ చాన్స్!

బాహుబలి ఎఫెక్ట్‌: రజనీకాంత్‌ సినిమాకు డైరెక్షన్ చాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో ఓ వైపు బాహుబలి, హిందీలో బజరంగి భాయిజాన్ సినిమాలు వారం గ్యాపుతో విడుదలై ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి తెలిసిందే. రెండు సినిమాలు కలిపి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1000 కోట్లు వసూలు చేసాయి. ఈ రెండు చిత్రాలకు కథ అందించి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో విజయేంద్రప్రసాద్ సౌత్ స్టార్ రజనీకాంత్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రజనీకాంత్, విజయేంద్రప్రసాద్ ఓ ఫంక్షన్ లో కలిసి ఈ విషయమై చర్చించినట్లు సమాచారం. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన స్టోరీ లైన్ విని రజనీకాంత్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే త్వరలోనే సినిమా విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Vijayendra Prasad to direct Rajinikanth?

రజనీకాంత్ త్వరలో శంకర్ దర్శకత్వంలో ‘రోబో-2' సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. 2016లో ఈ సినిమా ప్రారంభం కానుంది. దీని తర్వాత విజయేంద్ర ప్రసాద్ తో సినిమాకు రజనీకాంత్ ఓకే చెప్పే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి చాలా కాలం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయడానికి విజయేంద్రప్రసాద్ సిద్ధంగా ఉన్నారని, రజనీకాంత్ నుండి గ్రీన్ సిగ్నల్ లభిస్తే రజనీ ఇమేజ్ కి తగిన విధంగా స్క్రిప్టు వర్కు మొదలు పెడతారని టాక్.

ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాపుతో సాగుతుందని అంటున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ నుండి అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగే అవకాశం ఉంది. ఒక వేళ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఈ సినిమా ఆయనకు బాగా ప్లస్సవుతుందని అంటున్నారు.

English summary
Film Nagar source said that, Vijayendra Prasad to direct Rajinikanth. The reports further say that the senior writer narrated a story with a political backdrop and Rajini is said to have given his nod readily.
Please Wait while comments are loading...