»   » వివి వినాయిక్ నమ్మకానికి ఆ రోజే పరీక్ష

వివి వినాయిక్ నమ్మకానికి ఆ రోజే పరీక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్‌ రూపొందిస్తున్న చిత్రం టైటిల్ 'అల్లుడు శ్రీను'. ఆ చిత్రంలో హీరో నిర్మాత కొడుకు శ్రీనివాస్. ఇప్పటికే షూటింగ్‌ దాదాపు పూర్తికావస్తున్న ఈ చిత్రం త్వరలో ఆడియో పంక్షన్ కి సిద్దమవుతోంది. జూన్ 29 న ఆడియో, ట్రైలర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ కుటుంబకథా చిత్రంలో సమంత హీరోయిన్‌ నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలకు ధీటుగా హీరో శ్రీనివాస్‌ స్టెప్‌లు వేశాడని యూనిట్‌ చెబుతోంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రానికి సంభందించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం చాలా బాగా వస్తోందని, ట్రైలర్ విడుదల అయ్యాక..అంతా వినాయిక్ ప్రతిభ గురించే మాట్లాడుకుంటారని చెప్పుకుంటున్నారు.

"వి.వి.వినాయక్‌ను నేను సొంత కొడుకులా భావిస్తాను. వినాయక్ ఇప్పుడు మా శ్రీనివాస్‌ను తన బిడ్డ అనుకుని ఎక్స్‌ట్రా కేర్ తీసుకుని సినిమా చేస్తున్నారు. కథ గురించి సినిమా కొంత లేట్ అయింది. కానీ బెస్ట్ కథ కుదిరింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్ ఇది. యాక్షన్, లవ్ ప్రధానంగా సాగుతుంది. నేను శ్రీనివాస్‌ను ఇంట్లోనే కొడుకుగా చూస్తున్నాను. సెట్‌లో తను ఓ మాస్ హీరో, నేనో ప్రొడ్యూసర్‌ని అంతే. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాకే వినాయక్, ఛోటా.కె.నాయుడు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం వంటి గొప్ప టీమ్ దొరకడం అతని అదృష్టం. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇది. వేసవి కానుకగా విడుదల చేస్తాం'' అని బెల్లంకొండ సురేష్ అన్నారు.

Vinayak's Alludu seenu audio launch on

అలాగే వినాయక్‌కి భారీ పారితోషికం చెల్లించాననీ, అందుకే తను ఈ సినిమా ఒప్పుకొన్నాడని అనుకొంటున్నారు. కానీ అదేం కాదు. వినాయక్‌ వ్యక్తిత్వాన్ని డబ్బుతో కొనలేం. ఇది మా అబ్బాయి సినిమా అని ఎప్పుడూ అనుకోలేదు. వినాయక్‌ సినిమాకి శ్రీనివాస్‌ పనికొస్తాడా? లేడా? ఆయన జోరుకి సరితూగుతాడా? లేడా? అనే కోణంలోనూ ఆలోచించాం. అన్ని విధాలా సంతృప్తి పడిన తరవాతే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాం అని తన కుమారుడుతో వివి వినాయిక్ దర్సకత్వంలో చేస్తున్న చిత్రం గురించి చెప్పుకొచ్చారు.

English summary
Bellamkonda Suresh's son "Alludu Seenu" audio launch will be held on June, 29th on a grand scale.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu