»   » చిరుకోసం వినాయక్ కొత్త కండిషన్ : ఇప్పుడు సాధ్యమయ్యేనా..?

చిరుకోసం వినాయక్ కొత్త కండిషన్ : ఇప్పుడు సాధ్యమయ్యేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా "కత్తిలాంటోడు" జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అన్నారుగానీ ఇది ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. ఈ సినిమా కోసం చిరంజీవి తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. చాలానే కష్టపడ్డారన్న సంగతి ఆయన లుక్ చూస్తేనే తెలిసిపొతోంది.

అయితే ఇప్పుడు ఇంకొ చిక్కొచ్చింది. ఇప్పటికి తగ్గింది సరిపొదనీ మరో 5 కేజీలు బరువు తగ్గితే బాగుంటుంది అని దర్శకుడు వినాయక్ చిరంజీవికి ఇచ్చిన సూచనతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఠాగూర్ సినిమా టైంలో ఉన్న చిరంజీవి లుక్ కావాలంటున్నాడట వినాయక్

అయితే చిరంజీవి ఎంత ప్రయత్నించినా వినాయక్ కోరిన లుక్ పూర్తిగా మారక పోవడంతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతోంది అని అంటున్నారు. దీనికితోడు హీరోయిన్ విషయంలో కూడ తలెత్తుతున్న సమస్యలు వినాయక్ టెన్షన్ ని మరింత పెంచుతున్నాయట. రెమ్యూనరేషన్ చాలలేదని ఒక హీరోయిన్, చిరంజీవి‌తో చేయాలంటే నా కెపాసిటీ చాలదంటూ మరో హీరోయిన్ ఇలా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారు.

 Vinayak"s new condition for Chiru

ఇది చాలదు అన్నట్లుగా అరవైల వయసులో యంగ్ హీరోలతో పోటీపడి డ్యాన్సులు ఫైట్స్ చేస్తే బాగానే ఉంటుంది గానీఈ వయసులో అటువంటి పనులు చిరు ఆరోగ్యానికి మంచిది కాదు. అభిమానులకోసం ప్రయత్నించినా భవిశత్తులో వచ్చే సమస్యలను కూడా చూసుకోవాలి కదా..

చిరంజీవి కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా చేస్తున్న "కత్తిలాంటోడు" పై విపరీతమైన భారీ అంచనాలు ఉండటంతో ఈమధ్యనే అలా విపరీతమైన హైక్ లోకి వెళ్లి సూపర్ ప్లాప్ గా మారిన "బ్రహ్మోత్సవం" సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల ఫలితాలను చూస్తూంటే మరీ ఎక్కువ ఆలస్యం చేయటం కూడా సినిమా ఫలితాన్ని తారుమారు చేయొచ్చన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

దీనితో ఇప్పటికే తయారు అయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేర్పులతో పాటు హీరోయిన్ సమస్య ఇలా ఎన్నో కారణాలు చిరంజీవిని తన 150వ సినిమా విషయంలో అయోమయంలో పడేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవార్తలు ఇలా బయటకు రావడంతో చిరంజీవి తన 150 వ సినిమా విషయం మరికొద్ది రోజులు లేట్ చేస్తే స్టార్ డమ్ మరీ వెనక్కి వెళ్లే ప్రమాదముందంటూ చిరంజీవి అభిమానులు అందోళన పడుతున్నట్టు టాక్..

English summary
Buzz is that Director v.v.vinayak wants chiru look should be like Thagore Movie Days. So again shoot is getting late.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu