Don't Miss!
- News
sister: శాడిస్టు సిస్టర్, కోట్ల రూపాయల ఆస్తి, అన్నను కిడ్నాప్ చేసి ఏం చేసిందంటే?, ఆంటీ కొడుకు!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
విరాటపర్వం తరువాత మరో విభిన్నమైన కథతో రాబోతున్న దర్శకుడు.. స్టార్ హీరో ఫిక్స్?
ఇటీవల విరాటపర్వం సినిమాతో ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు వేణు ఉడుగుల నెక్స్ట్ మరొక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రానా దగ్గుపాటి సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినాప్పటికీ కూడా విమర్శకుల ప్రశంసలు అయితే అందుకుంది.
అంతేకాకుండా ఓటీటీ లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చింది. దీంతో దర్శకుడికి కూడా మంచి గుర్తింపు లభించింది. కొంతమంది ప్రముఖ దర్శకులు కూడా వేణు అడుగుల డైరెక్షన్ పై పాజిటివ్గా స్పందించినట్లు సమాచారం. అయితే ఒక బడా నిర్మాత ఈ దర్శకుడికి మంచి ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా కమర్షియల్ గా కూడా సక్సెస్ అందుకోవాలని వేణు ప్రస్తుతం ఒక బలమైన స్క్రిప్ట్ అయితే సిద్ధం చేసుకుంటున్నాడు.

ఆ సినిమా పూర్తిగా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక స్టార్ హీరో కూడా హీరోగా ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేసే అవకాశం ఉంది అని అనేక రకాల కథనాలు వచ్చాయి. కానీ ఇంకా ఆ విషయంలో దర్శకుడు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా విరాటపర్వం సినిమా చూసిన తర్వాత దర్శకుడితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపించింది. అంటే త్రివిక్రమ్ తో మాట్లాడితే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం కూడా వచ్చినట్లే అనే సెంటిమెంట్ ఉంది. మరి ఆ రూట్లో దర్శకుడు ఏమైనా అవకాశం అందుకున్నాడో లేదో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.