»   » 'వైవా' హర్ష కి రామ్ చరణ్ బ్రేక్ ఇస్తాడా?

'వైవా' హర్ష కి రామ్ చరణ్ బ్రేక్ ఇస్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'వైవా' అనే షార్ట్ ఫిలిం ద్వారా అందరికీ పరిచయమై,పాపులరైనన హర్ష చెముడు గుర్తుండే ఉంటారు. ఆయన ఇప్పుడు మెగా కాంపౌండ్ లో ఆఫర్ సంపాదించారని ఫిల్మ్ నగర్ సమాచారం. కృష్ణ వంశీ, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో హర్షకు ఓ కీలకమైన పాత్రను ఇచ్చారని చెప్తున్నారు. కృష్ణ వంశీ దర్శకుడు కావటంతో సినిమాల్లోనూ బ్రేక్ వచ్చే అవకాసం ఉంది. రామేశ్వరం షెడ్యూల్ లో వీరిద్దరి మధ్యా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించరనున్నారు. ఇక హర్షతో ఆయనతో ఆ మధ్య రామ్,వెంకటేష్ ల మసాలా కు ప్రమోలు కూడా చేయించారు. అయితే అవి అంతగా వర్కవుట్ కాలేదు.

కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు.పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించి రీసెంట్ గా ప్రారంభం జరిగింది.

'Viva' Harsha bags Mega opportunity

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- 'క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, కుటుంబ భావోద్వేగాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా దర్శకుడు మంచి కథను సిద్ధం చేశారని, రామ్‌చరణ్ కెరీర్‌లో సరికొత్త పాత్రగా నిలిచే ఈ సినిమాలో కాజల్ మరోసారి ఆయనతో జతకట్టనుందని, ఇదే కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం 'మగధీర' తరువాత అంత విజయం సాధిస్తుందని తెలిపారు. రాజ్‌కిరణ్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జి ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారని, ఈ షూటింగ్ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో, ఆ తరువాత 40 రోజులపాటు రామేశ్వరం, నాగర్‌కోయిల్, పొల్లాచ్చిలో చేస్తామని' అన్నారు.

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
Harsha Chemudu, popularly known as Viva Harsha has got chance to showcase his mettle in upcoming Ram Charan's flick under Krishna Vamsi's direction. In the next Rameswaram schedule of the flick, scenes featuring Charan and Harsha will be canned, a source revealed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X