»   » హీరోతో ఇబ్బంది పడుతున్న వి.వి వినాయిక్

హీరోతో ఇబ్బంది పడుతున్న వి.వి వినాయిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇంతకాలం స్టార్స్ ని డైరక్ట్ చేసిన వివి వినాయిక్ ప్రస్తుతం కొత్త హీరోని డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందింస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. అయితే షూటింగ్ సమయంలో వినాయిక్ చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ పాట చిత్రీకరణ సమయంలో సీనియర్ అయిన సమంత తో కొత్త హీరో శ్రీనివాస్ ని బ్యాలెన్స్ చేయటం కష్టంగా మారిందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుస గుసలు వినపడుతున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ ని అందరనీ ఈ చిత్రం కోసం ఆయన సమకూర్చారు.

వివి వినాయిక్ మాట్లాడుతూ... నేను బెల్లంకొండ సురేష్ కుమారుడుని లాంచ్ చేయటానికి కమిటయ్యాను. ఎందుకంటే ఆయన నా మొదటి నిర్మాత. ఆది సినిమాతో నాకు కెరీర్ ఇచ్చిన వ్యత్తి. అందుకో ఆయన కుమారుడు చిత్రాన్ని నేను మంచి స్క్రిప్టుతో చేయాలనుకుంటున్నాను. అందుకోసం చాలా కథలు విన్నాను...కానీ నన్ను ఏదీ తృప్తి పరచలేదు. నాకు నచ్చింది బెల్లంకొండ కు నచ్చలేదు. అయితే ఫైనల్ గా ఓ లైన్ ని ఓకే చేసుకున్నాం. దాంతో ముందుకు వెళ్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుంచి ప్రారంభమం చేసాం అన్నారు.

VV. Vinayak

ల్లంకొండ సురేశ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్స్ ల్లో ఒకరైన సమంత నటిస్తుండటం విశేషం.కొంత కాలం క్రితం రెండు నెలల పాటు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సురేశ్ అండగా నిలిచి ఆదుకున్నారనీ, ఆ కృతజ్ఞతతో శ్రీనివాస్ సరసన చేస్తున్నాననీ ఇప్పటికే సమంత తెలిపింది. కొంతకాలంగా శ్రీనివాస్ నటన, డాన్స్, ఫైట్స్ వంటి విభాగాల్లో చక్కని శిక్షణ తీసుకుంటూ వచ్చాడు.

ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. నాయక్ చిత్రం తర్వాత వినాయిక్ చేస్తున్న చిత్రం ఇదే. వినాయిక్ మొదటి చిత్రం ఆది కి నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యానర్ మీదే చేయటంతో ఆ అనుబంధం ఇలా కొనసాగుతోంది.

English summary
Vinayak who directed top stars is currently directing debutant Srinivas, son of Bellamkonda Suresh. Vinayak is finding difficulty in balancing debutant Srinivas and experienced Samantha. Recently a song was filmed and some scenes are being canned. Devi Sri Prasad is the music director. Bellamkonda Suresh roped in highly professional technicians and padding artists to make the film grandly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu