»   » నిన్న ఇల్లు, ఇపుడు థియేటర్ అమ్మకానికి పెట్టిన వినాయక్!

నిన్న ఇల్లు, ఇపుడు థియేటర్ అమ్మకానికి పెట్టిన వినాయక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కు సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్ లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లును రూ. 20 కోట్లు అమ్మినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయాన్ని వినాయక్ గానీ, ఆయన సన్నిహితులు గానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా ఖరారు చేయలేదు.

వినాయక్ దర్శకత్వం వహించిన ‘అఖిల్' సినిమా భారీ డిజాస్టర్ అయింది. కేవలం తనను నమ్మి సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్స్ కి డబ్బు సెటిల్మెంటు చేయడంలో భాగానే ఆయన ఇల్లు అమ్మాడని అంటున్నారు. ఇల్లు అమ్మిన సంగతి విషయం ఓ వైపు ప్రచారంలో ఉండగానే మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

VV Vinayak sells off Theatre?

తాజాగా వినాయక్ తన సొంతూరులో ఉన్న వీమాక్స్ థియేటర్ కూడా అమ్మకానికి పెట్టారని అంటున్నారు. ఇటీవల ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో సెటిల్మెంటు చేయగా కొంత మిగిలిందని, తాజాగా థియేటర్ అమ్మగా వచ్చిన డబ్బుతో విశాఖపట్నంలో మరో కొత్త థియేటర్ కొనేందుకు వినాయక్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.

అయితే వినాయక్ ఇల్లు అమ్మడానికి కారణం వేరే అనే వాదన కూడా ఉంది. ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని, ఆ ఇంట్లోకి వెళ్లినప్పటి నుండి తనకు అంతా నష్టమే జరుగుతుందని, కెరీర్ కూడా హిట్ బాటలో నడవటం లేదని, అందుకే ఇల్లు అమ్మాడని అంటున్నారు. ఇలా రకరకాలుగా వినాయక్ ఇల్లు అమ్మకంపై ప్రచారం జరుగుతోంది. వినాయక్ స్వయంగా స్పందిస్తే తప్ప ఏ విషయం అనేది తేలే అవకాశం లేదు.

English summary
Vinayak has reportedly sold off his bungalow worth Rs 20Cr in filmnagar and is apparently looking to sell his VMax theater as well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu