»   » వివి వినాయక్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్?

వివి వినాయక్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎలాంటి హీరో అయినా, ఎలాంటి సబ్జెక్ట్ అయినా దాన్ని పక్కా కమర్షియల్ గా తెరకెక్కించగలిగే సత్తా ఉన్న దర్శకుడిగా వివి వినాయక్ కు పేరుంది. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'ఖైదీ నెం 150' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత ఇండస్ట్రీలో అతి పెద్ద హిట్ ఇదే.

ఇప్పటి వరకు తెలుగులో పెద్ద హీరోలందరితో చేసిన వినాయక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో మాత్రం చేయలేదు. వీరితో చేసే అవకాశం కోసం ఆయన కూడా ఎదురు చూస్తున్నారు.

త్వరలో పవన్ కళ్యాణ్ మూవీ

త్వరలో పవన్ కళ్యాణ్ మూవీ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని వివి వినాయక్ ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో...

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో...

పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్‌కు కూడా తోడ్పడే విధంగా ఓ మంచి సబ్జెక్ట్ వివి వినాయక్ వద్ద ఉందని, పవన్ కళ్యాణ్ కు ఈ కథ ఇప్పటికే వినిపించారని, ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల్లోపే...

2019 ఎన్నికల్లోపే...

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ అయ్యే అవకాశం ఉండటంతో ఈ లోపే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో వివి వినాయక్ సినిమా కూడా ఉండే అవకాశం ఉంది.

త్వరలో క్లారిటీ

త్వరలో క్లారిటీ

అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా కమిట్మెంట్స్ ఇచ్చారు. అందులో అతి ముఖ్యమైనది అన్నయ్య చిరంజీవితో కలిసి సుబ్బిరామిరెడ్డి నిర్మాతగా చేసే సినిమా. దీంతో పాటు మరో రెండు కమిట్మెంట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

English summary
Vinayak who worked with almost every recognisable hero of Telugu Cinema, is planning to direct both the reining big stars, Mahesh Babu and Pawan Kalyan. As he thinks Pawan Kalyan will be available after his movie with Trivikram, the director feels this is his opportunity to seize with a perfect story that will work with Pawan Kalyan's political aspirations too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu