Don't Miss!
- Sports
WPL 2023: అమ్మాయిలకు ఆర్సీబీ బంపరాఫర్!
- News
మాజీ కేంద్రమంత్రి, దిగ్గజ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
వాల్తేరు వీరయ్య vs వీరసింహా రెడ్డి ట్రైలర్స్ రెడీ.. ఎప్పుడు రాబోతున్నాయంటే?
సంక్రాంతికి మరోసారి నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి పోటీ పడబోతున్నారు. ఇంతకుముందే చాలాసార్లు వీరు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. అది కూడా సంక్రాంతి బరిలోనే ఎక్కువ స్థాయిలో వీరి మధ్య యుద్ధం కొనసాగింది. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు బాలయ్య గెలిస్తే మరి కొన్నిసార్లు చిరంజీవి పై చేయి సాధించారు. మరికొన్నిసార్లు అయితే ఇద్దరు కూడా మంచి విజయాలను అందుకొని ఇరువర్గాల అభిమానులను సంతృప్తి పరిచారు.
అయితే ఈ సంక్రాంతికి మాత్రం వీరి మధ్య కొనసాగి పోటీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది.. అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు ఒకే తరహాలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు మాస్ కమర్షియల్ దర్శకుడు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు కొన్ని టీజర్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అందులోనూ రవితేజ మరొక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తూ ఉండడం హైలైట్ కాబోతోంది.

ఇక మరోవైపు క్రాక్ సినిమాతో సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య బాబుతో సినిమా చేస్తూ ఉండడంతో మాస్ అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. కాబట్టి ఈ సినిమా కూడా పోటీగా నిలవబోతోంది. ఇక సంక్రాంతికి రాబోయే ఈ సినిమా ట్రైలర్స్ విడుదల తేదీలపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది.
ముందుగా జనవరి 4వ తేదీన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య టైటిల్ విడుదల కాబోతోంది. ఇక జనవరి 6వ తేదీన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా శృతిహాసన్ మెగా రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.