»   » పవన్ డ్యూటీ ఎక్కే సమయం, 25 శాతం కన్సెషన్ డిటేల్స్

పవన్ డ్యూటీ ఎక్కే సమయం, 25 శాతం కన్సెషన్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తిరిగి సెట్స్ కు జూన్ రెండవ వారంనుంచి రానున్నారు. ఆయన తన తాజా చిత్రం ఎస్ జె సూర్య దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ చిత్రం క్రితం నెలలోనే లాంచ్ అయ్యింది. ఆ చిత్రానికి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ క్రితం జరుగుతోంది. ఈ నెలాఖరుతో ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ చేసి షూటింగ్ కు రెడీ అవుతున్నారు.

రైటర్ ఆకుల శివ, దర్శకుడు ఎస్ జె సూర్య కలిసి స్క్రిప్టుపై కూర్చుని ఫైనల్ నేైరేషన్ ఇవ్వటానికి సిద్దంగా ఉన్నారు. పవన్ ..ఎబ్రాడ్ నుంచి రాగానే ఫైనల్ నేరేషన్ ఇచ్చి కరెక్షన్స్ ఉంటే చేసేసి, సెట్స్ కు వెళ్లిపోవాలని ప్రస్తుతానికి వారు ప్లాన్ చేసుకున్నారు.

ఫిల్మ్ సర్కిల్స్ లో వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ చిత్రం తమిళ స్టార్ హీరో అజిత్ చేసిన వీరం(తెలుగులో వీరుడొక్కడే) నే బేస్ చేసుకుని మెయిన్ ప్లాట్ తీసుకుని కథ అల్లారని చెప్తున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఈ సినిమా లో పవన్ లుంగీ, గ్రే హెయిర్ స్టైయిల్ తో లాంచింగ్ రోజు కనపడ్డారు. అజిత్ ..వీరంలో అదే గెటప్ లో ఉండటంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.

When will Pawan Kalyan back to work?

పవన్..సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం డిజాస్టర్ కావటంతో అదే డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ సినిమాని ఇరవై ఐదు శాతం కన్సెషన్ తో ఇవ్వనున్నట్లు వార్త. ఓ ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరిగా ఈ సినిమాని చెప్తున్నారు. పవన్, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం కొమురం పులి. ఆ చిత్రం పవన్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నమోదైంది.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా బెంగుళూరు డేస్ పేమ్ పార్వతి మీనన్ చేసే అవకాసం ఉంది. అయితే మరో ప్రక్క శృతి హాసన్ ని పవన్ ప్రక్కన అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ ..సిటీకు వచ్చేదాకా ఏదీ ఫైనల్ కాదు. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. బిళ్లా, బెంగాళ్ టైగర్ చిత్రాలకు కెమెరా వర్క్ అందించిన సౌందర్ రాజన్ ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందించనున్నారు.

English summary
Pawan Kalyan will be back to work from June second week. Pawan Kalyan who is in abroad for a vacation will be back by then.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu