»   » ‘వంగవీటి’ నిర్మాత మిస్సింగ్... కారణం వార్నింగ్ లేనా? ఇంకేదైనా?

‘వంగవీటి’ నిర్మాత మిస్సింగ్... కారణం వార్నింగ్ లేనా? ఇంకేదైనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా రిలీజ్ అయ్యాక..నిర్మాత , దర్శకుడు మీడియావారితో ఇంటరాక్ట్ అవటం, సినిమా ప్రమోషన్ చేసుకోవటం జరుగుతూంటుంది. ముఖ్యంగా నిర్మాత చాలా యాక్టివ్ గా ఉంటూంటారు.

అయితే వంగవీటి చిత్రం నిర్మాత దాసరి కిరణ్ కిమార్ మాత్రం మీడియాకు టచ్ లో లేడని వినపడుతోంది. కేవలం మీడియాకే కాదు...ఎవరికీ సినిమా రిలీజ్ అనంతరం కనపించకుండా..మేనేజ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.


వాస్తవానికి ..జీనియస్.. రామ్ లీలా లాంటి చిన్న సినిమాలూ తీస్తూ వచ్చిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్.. రామ్ గోపాల్ వర్మతో చేసిన'వంగవీటి' లాంటి పెద్ద నిర్మాత అయ్యాడు. ఆయన అంతకుముందు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒకటి ఒకెత్తు. ఈ సినిమాతో ఆయన పేరు మీడియాలో మార్మోగిపోయింది.


క్రేజ్ అలాగే

క్రేజ్ అలాగే

దానికి తోడు ...దాసరి కిరణ్ కుమార్ కాకుండా ఇంకే నిర్మాత అయినా ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదని.. సినిమా పూర్తయ్యేది కాదని అతణ్ని రామ్ గోపాల్ వర్మే స్వయంగా ఎత్తేయటంతో మరింత క్రేజ్ వచ్చింది.


అందరిలో ఆశ్చర్యం

అందరిలో ఆశ్చర్యం

కానీ విడుదలకు ముందు తన గురించి, తన సినిమా గురించి జరిగిన జనం మాట్లాడుకోవటం చూసి చాలా ఉత్సాహంగా కనిపించిన దాసరి కిరణ్ కుమార్.. ఆ తర్వాత ‘వంగవీటి' రిలీజ్ అనంతరం ఎక్కడా కనిపించకుండా పోవడం అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు కారణం ఈ సినిమాపై వస్తున్న నిరసనలే అంటున్నారు.


వార్నింగ్ లు సైతం

వార్నింగ్ లు సైతం

ఇప్పటికే ...‘వంగవీటి' సినిమా చూసి రంగా అభిమానులు.. కాపు సామాజిక వర్గం మండిపోతున్నారు. తమ నేత రంగాను కావాలనే తగ్గించి చూపించారని వర్మకు వార్నింగ్ లు సైతం ఇస్తున్నారు.


సీరియస్ అవుతున్నారు

సీరియస్ అవుతున్నారు

దాసరి కిరణ్ కుమార్ స్వయంగా కాపు నేత అయి ఉండి ఇలాంటి సినిమా తీస్తుంటే ఏం చేస్తున్నాడంటూ అతడి మీద కూడా సీరియస్ అవుతున్నారు.


మనోభావాలు ..

మనోభావాలు ..

అక్కడితో ఆగకుండా...వంగవీటి చిత్రం పైన రంగా అభిమానులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓ వర్గం మనోభావాలను కించపరిచేలా 'వంగవీటి' సినిమాను చిత్రీకరించారని వారు హెచ్చార్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


నిలదీసే పరిస్దితి

నిలదీసే పరిస్దితి

ఇక మీడియాలో వస్తున్న వార్తలను బట్టి...ఈ సినిమా విషయంలో వందలాది కాల్స్ వస్తుండటం.. అందరూ తనను నిలదీసే పరిస్దితి ఉండటంతో కిరణ్ కుమార్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తన సెల్ స్విచాఫ్ చేసి ఎవరికీ దొరక్కుండా ఆయన అజ్నాతంలోకి వెళ్లిపోయినట్లు చెప్పుకుంటున్నారు.


ప్రకటన ఇచ్చే

ప్రకటన ఇచ్చే

పరిస్థితులు సద్దుమణిగాక బయటికి వచ్చి.. తన వివరణ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. సినిమాని సినిమాగానే చూడాలని ఆయన ప్రకటన ఇచ్చే అవకాసం ఉందంటున్నారు. ఇందులో నిజమెంత అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది.


మాట ఇచ్చాడా

మాట ఇచ్చాడా

వంగవీటి చిత్రం ప్రారంభానికి ముందే నిర్మాత అయిన కిరణ్ కుమార్ ని రంగా..రాదా మిత్ర మండిలి వారు కలిసారని, అప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చారని, అయితే అవేమి ఫైనల్ అవుట్ లో కనపడలేదని చెప్పుకుంటన్నారు. అందుకే వారు ఆయనపై మండిపడుతున్నట్లు వినికిడి.


చూపెట్టలేదా

చూపెట్టలేదా

ఇండస్ట్రీలో చెప్పుకునేదాన్ని బట్టి..వర్మ ఫైనల్ అవుట్ ని నిర్మాతకు చూపెట్టలేదని చెప్పుకుంటున్నారు. అయితే వర్మ వంటి డైరక్టర్..అలా ఎందుకు చేస్తారు..నిర్మాతకు గౌరవం ఇచ్చే, ఫైనల్ అవుట్ పుట్ చూపించే విడుదల చేస్తారని, అయితే ఆ సమయానికి వర్మ చెప్పిన మాటలకు ఖచ్చితంగా నిర్మాత కన్వీన్స్ అయ్యింటారని, అంటున్నారు.


బాగానే వర్కవుట్

బాగానే వర్కవుట్

అయితే వంగవీటి చిత్రంతో ఆయన నిర్మాతగా మాత్రం ఆర్దికంగా బాగానే వర్కవుట్ అయ్యిందని, చాలా తక్కువ మొత్తానికి సినిమా తీసి భారీ మొత్తాలకి అమ్మారంటున్నారు.


అసలు సినిమాలో ఏముంది...

అసలు సినిమాలో ఏముంది...

వర్మ 'మేటి' చిత్రం మాత్రం కాదు ( ‘వంగవీటి' రివ్యూ)


English summary
Dasari Kiran Kumar is the producer of the controversial Vangaveeti. Ranga Radha Mitra Mandali activists have approached the Human Rights Commission on the issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X