»   » వర్మ 'మేటి' చిత్రం మాత్రం కాదు ( ‘వంగవీటి’ రివ్యూ)

వర్మ 'మేటి' చిత్రం మాత్రం కాదు ( ‘వంగవీటి’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

నిజ జీవిత కథల్ని మంచి ఇంటెన్సిటీతో డ్రమటిగ్గా ప్రెజెంట్ చేయడంలో వర్మది అందె వేసిన చేయి. ఆ విషయాన్ని తన ప్రత్యేకతను 'రక్తచరిత్ర' సినిమాతో మరోసారి చాటుకున్నాడు. 'రక్తచరిత్ర' లాగే 'వంగవీటి' కూడా ఆసక్తికర.. వివాదాస్పద నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి ఊహించిన విధంగానే క్రేజ్ క్రియేట్ అయ్యింది.

అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలపై జనాలకు ఎంత ఆసక్తి ఉందో.. బెజవాడ రౌడీ రాజకీయాల మీదా జనాల్లో అంతే ఆసక్తి ఉండటం గమనించిన వర్మ 'వంగవీటి' కి శ్రీకారం చుట్టిన రిలీజ్ చేసారు. ముఖ్యంగా బెజవాడ రౌడీ రాజకీయాల గురించి వర్మకు మరింత ఎక్కువగా అవగాహన ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.


దానికి తోడు వర్మ స్వయంగా విజయవాడలో ఆనాటి ఆ పరిస్థితుల్ని చూసినవాడు కావంటంతో ఈ సినిమాతో అప్పటి పరిస్దితులను మళ్లీ కళ్ల ఎదుట పెడతారు. రంగా హత్య విషయంలో అసలేం జరిగింది అనే మిస్టరీని సినిమాలో చూపిస్తారు అని ఆశించారు జనం.


ఈ చిత్రం మరో ట్రెండ్ సెట్టర్ అవుతుందా? లేక సాదాసాదా రెగ్యులర్ వర్మ రొటీన్ కథగా మిగిలిపోతుందా,వర్మ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యాడా...సినిమా ఎలా ఉంది.. 'రక్తచరిత్ర' నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా, కథ ఏమిటి, అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.


 బస్టాండ్ ఉండే రౌడి రాధ

బస్టాండ్ ఉండే రౌడి రాధ


ఎర్రపార్టీ లీడర్ చలసాని వెంకటరత్నం విజయవాడ సిటీలో పేదలకు అండగా ఉంటూ లీడర్ గా ఎదుగుతాడు. అదే సమయంలో బస్టాండ్ లో చిన్న రౌడీగా ఉన్న వంగవీటి రాధ(సందీప్‌కుమార్‌). వెంకటరత్నం దగ్గర పనిలో చేరి అతన్ని మించిపోయే స్థాయిలో పేరు తెచ్చుకుంటాడు. పక్కా ప్లాన్ తో మర్డర్

పక్కా ప్లాన్ తో మర్డర్


విజయవాడలో వెంకటరత్నం నీడలో ఎదిగిన ఈ రౌడీ రాధా (సందీప్‌కుమార్‌) ఎదుగుదలను తట్టుకోలేని వెంకటరత్నం ఇంటికి పిలిచి రాధను అవమానిస్తాడు. అవమానించడంతో రాధ పగతో రగిలిపోతాడు. అదే సమయంలో అనుచరులు రెచ్చగొట్టడంతో రాధ వెంకటరత్నాన్ని పక్కా ప్లాన్ తో దారుణంగా నరికి నరికి చంపుతాడు.


 ఎదురులేని స్దాయికి

ఎదురులేని స్దాయికి


వెంకటరత్న మర్డర్ తో... విజయవాడ మొత్తం తన చేతుల్లోకి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఓ లీడర్ వెనుక అనుచరిడిగా ఉన్న రాధ, విజయవాడను శాసించే నాయకుడిగా మారతాడు. తనకు ఎదురొచ్చిన వారందరిని అడ్డుతప్పించుకుంటూ ఎవరూ ఎదిరించలేని స్థాయికి చేరుకుంటాడు.


 రాధాకు వీళ్లు దగ్గరవుతారు

రాధాకు వీళ్లు దగ్గరవుతారు


వెంకటరత్నం హత్య జరిగిన సమయంలో కాలేజీలో చదువుకొంటున్న గాంధీ (కౌటిల్య), నెహ్రూ (శ్రీతేజ్‌) సోదరులు రాధాకి దగ్గరవుతారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే దేవినేని గాంధీ, దేవినేని నెహ్రులు కాలేజీ గొడవలో పార్టీ ప్రమేయాన్ని ఆపాలంటూ రాధను కలుస్తారు. రాధ మంచితనం నచ్చి అతనితో కలిసి ఓ పార్టీని ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి రాధకు అండగా నిలుస్తారు


 ఓ వర్గం ఉండాలని

ఓ వర్గం ఉండాలని


కాలేజ్ లో తమకంటూ ఓ వర్గం ఉండాలని యునైటెడ్‌ ఇండిపెండెన్స్‌ పేరుతో ఓ యూనియన్‌ స్థాపించాలని సలహా ఇస్తారు. వాళ్ల సూచన మేరకే రాధా యూనియన్‌ని స్థాపిస్తాడు.


సెటిల్మెంట్ కు పిలిచి మర్డర్

సెటిల్మెంట్ కు పిలిచి మర్డర్

రాధ ఎదుగుదలతో విజయవాడ నగరంలో వెంకటరత్నం .. ఎర్ర పార్టీ ఆనవాళ్లు లేకుండా పోతాయన్న భయంతో ఆ పార్టీ పెద్దలు రాధ హత్యకు పథకం వేస్తారు. ఓ సెటిల్మెంట్ కోసం పిలిపించి ఒంటరిని చేసి చంపేస్తారు.


రంగాకి విభేధాలు

రంగాకి విభేధాలు

ప్రత్యర్థుల చేతుల్లో రాధా హత్యకి గురవ్వటంతో .... దాంతో అనుచరులంతా రాధా స్థానాన్ని ఆయన తమ్ముడు రంగా (సందీప్‌కుమార్‌)కి కట్టబెడతారు. ఇంతలో స్టూడెంట్‌ యూనియన్‌ నీడలో ఎదుగుతున్న గాంధీ, నెహ్రూలతో రంగాకి విభేదాలు ఏర్పడతాయి. అవి తారస్థాయికి చేరి గాంధీ, నెహ్రూలు కళాశాలలో కొత్త యూనియన్‌ స్థాపించే వరకు వెళతాయి.


మరొక హత్య

మరొక హత్య

అప్పటి వరకు అన్నకు అండగా ఉన్న దేవినేని సోదరులతో అభిప్రాయ భేదాలు రావటంతో వారు సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. దేవినేని సోదరుల నుంచి రంగా ప్రాణానికి ముప్పు ఉందని భావించి ఆయన అనుచరులు గాందీని చంపేస్తారు.


రంగాపై ప్రతీకారం..

రంగాపై ప్రతీకారం..

అన్న గాంధీ హత్యకి ఆయన చిన్న తమ్ముడు మురళి (వంశీ చాగంటి) రగిలిపోతాడు. ఎలాగైన రంగా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎలా ప్రతీకారం తీర్చుకొవాలనుకుంటాడు.


కొత్త పార్టీలోకి నెహ్రూ

కొత్త పార్టీలోకి నెహ్రూ

మరో ప్రక్క అప్పటి వరకు రౌడీగా ఉన్న రంగా ఓ జాతీయ పార్టీ నుంచి టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అదే సమయంలో ఆంధ్రరాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీలో చేరిన నెహ్రు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. నెహ్రు ఎమ్మెల్యే కావటంతో అతని తమ్ముడు మురళీకి పగ తీర్చుకునేందుకు కావాల్సిన అన్ని వనరులు అందుతాయి.


ఇంటికి ఫోన్ చేసి వార్నింగ్

ఇంటికి ఫోన్ చేసి వార్నింగ్

దీంతో గాంధీ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒక్కొక్కరిని మురళి వెతికి వెతికి చంపుతాడు. అంతేకాదు ఏకంగా రంగా.. ఇంటికే ఫోన్ చేసి ఆయన భార్య రత్న కుమారికి వార్నింగ్ ఇస్తాడు. మరోసారి మురళీ వల్ల రంగాకు ప్రమాదం ఉందని భావించి అతన్ని కూడా రంగా అనుచరులు చంపేస్తారు.


నిరాహార దీక్ష చేస్తున్న రంగాని

నిరాహార దీక్ష చేస్తున్న రంగాని

అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ విజయవాడలో పెరిగిపోతున్న రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రజా సమస్యల కోసం తన ఇంటి ముందే నిరాహార దీక్ష చేస్తున్న రంగాను నల్ల బట్టల్లో వచ్చిన దుండగులు దీక్షా వేదిక మీద నరికి చంపేస్తారు.


మరణం వెనక ఉన్నది ఎవరు

మరణం వెనక ఉన్నది ఎవరు

వంగవీటి రంగ మరణంతో రగిలిపోయిన విజయవాడ కొద్ది రోజులకు సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే రంగా మరణం వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం వర్మ కూడా తేల్చలేదు. మిస్టరీగా ప్రేక్షకులకు ప్రశ్నగానే వదిలేశాడు.


 లోతుగా వెళ్లకపోవటంతో..

లోతుగా వెళ్లకపోవటంతో..


వంగవీటిలో రామ్ గోపాల్ వర్మ ..ఏ వివాదాన్ని, కాంట్రవర్శిని ముట్టుకోలేదు. ఆయన రాధ, రంగ, నెహ్రూలకు సంభందించి లోతుగా వెళ్లలేదు. చీకటి కోణాలను టచ్ చేయలేదు. దాంతో సినిమా ఓ రొటీన్ రివేంజ్ డ్రామాగా మిగిలిపోయింది అంతే.


 ఇంతా చేసి అలా ఉంది

ఇంతా చేసి అలా ఉంది


ఎంతో ప్రతిష్టాత్మకంగా ఛాలెంజింగ్ ఉండబోతుంది సినిమా అనుకనేవారికి విజయవాడలో రెండు దశాబ్దాల కాలంలో జరిగిన మర్డర్స్ ని డాక్యుమెంట్ చేసినట్లైంది. దాంతో రక్తం, వరస మర్డర్స్ తో రివేంజ్ కథ చూస్తున్నట్లు ఉంటుంది. అదే ఆ మర్డర్స్ కు ఉన్న నేపధ్యం సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఖచ్చితంగా ఓ హిస్టారిక్ మూవ్ మెంట్ గా మిగిలేది. అలాకాకపోవటంతో.. రక్త చరిత్ర పార్ట్ 3 గా అనిపిస్తుంది తప్ప ప్రత్యేకంగా కనపడదు.


కీలకమైనవే వదిలేసాడు

కీలకమైనవే వదిలేసాడు


సినిమాలో కీలకంగా చూపెడతారని ఆశించిన ..వెంకటరత్నానికి..అతని అసిస్టెంట్స్ రాధకు మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి. గాంధీని ఎందుకు మర్డర్ చేసారు. మురళిని ఎందుకు చంపాల్సి వచ్చింది..రంగ,రత్నకుమారి మధ్య లవ్ స్టోరీ ఏంటి వంటి విషయాలు కేవలం పైపైనే టచ్ చేస్తూ వెళ్లిపోయారు. దాంతో సినిమాకు ఎమోషనల్ డెప్త్ రాలేదు.


 ప్రస్తావన తేలేదు

ప్రస్తావన తేలేదు


వర్మ మాత్రం వివాదాస్పదమైన విషయాల జోలికి వెళ్లలేదు. కులాలూ, పార్టీల ప్రస్తావన పెద్దగా తీసుకు రాలేదు. ‘విజయవాడ రౌడీ రాజకీయం వెంకటరత్నం నుంచి ఎలా మొదలైంది? ఆయన నీడలో రాధా ఎలా ఎదిగాడు? వాళ్లిద్దరి హత్యలు ఎలా జరిగాయి? ఏ పరిస్థితుల్లో రాధా తమ్ముడు రంగా తన వర్గానికి నాయకత్వం వహించాడు?' తదితర విషయాల మీదే వర్మ దృష్టి పెట్టారు.


 ఫస్టాఫ్ లో ఉన్న స్పీడు ఏమైంది

ఫస్టాఫ్ లో ఉన్న స్పీడు ఏమైంది


సినిమాలో ఫస్టాఫ్ లో కథంతా కూడా వర్మ తనదైన శైలి సీన్స్, ఎమోషన్స్ తో ఆకట్టుకొంటుంది. రంగా రాజకీయ ప్రవేశం నుంచి కథలో వేగం తగ్గుతుంది. వెంకటరత్నం, రాధా, గాంధీ హత్యలు.. ఆ వెనుక పరిణామాల్ని చూపించిన స్థాయిలో... ద్వితీయార్ధంలో సీన్స్ ని తీర్చిదిద్దలేకపోయారు వర్మ. కీలకమైన మురళి, రంగా హత్యలు సెకండాఫ్ లోనే ఉన్నప్పటికీ తొలి సగభాగం కథలా మాత్రం ఆసక్తి రేకెత్తలేదు. రంగా హత్యోదంతంతోనే కథని ముగించారు. ఆ డిపార్టమెంట్ దే గ్రేట్

ఆ డిపార్టమెంట్ దే గ్రేట్


1980 నాటి విజయవాడ వాతావరణాన్ని చాలా సహజంగా చూపించారు వర్మ. అందుకోసం ప్రత్యేకంగా కసరత్తు చేసినట్టు కూడా అనిపించదు. సహజమైన లొకేషన్లనే వాడుకొని చిత్రాన్ని అప్పటి వాతావరణాన్ని కళ్లకు కడుతున్నట్టుగా తీర్చిదిద్దారు. అది ఆర్ట్ డిపార్టమెంట్ గొప్పతనమే.


 రంగాని చంపిందెవరు

రంగాని చంపిందెవరు


కథలో జరిగే ప్రతి మర్డర్ కీ కారణమేంటన్నది స్పష్టంగా చూపించారు కానీ.. రంగా హత్యకి కారకులెవరన్నది మాత్రం బయట పెట్టలేదు. ఆ విషయం ఒక్క విజయవాడ కనకదుర్గమ్మకి మాత్రమే తెలుసుకానీ.. అమ్మలగన్నమ్మ అయిన ఆమె ఏ ఎక్స్‌ప్రెషనూ లేకుండా ఇప్పటికీ అలాగే చూస్తుండిపోయిందని వర్మ తనదైన శైలిలో సెటైర్‌ వేసి కథని ముగించారు.


 అదరకొట్టాడు

అదరకొట్టాడు


ఈ సినిమా కథలో కీలకమైన వంగవీటి రాధ, వంగవీటి రంగా పాత్రల్లో కనిపించిన సందీప్ కుమార్, ఆవేశపరుడైన రౌడీగా.. ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడిగా బాగా నటించాడు అనేకంటే టాప్ క్లాస్ నటన చూపాడనాలి. రెండు పాత్రల్లోనూ చాలా బాగా ఒదిగిపోయాడు సందీప్‌. ఇతనికి ఖచ్చితంగా తెలుగు పరిశ్రమలో మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పచ్చు.


 మెప్పించాడు..

మెప్పించాడు..


శేఖర్ కమ్ముల...హ్యాపిడేస్ సినిమాలో స్టూడెంట్ గా ఆకట్టుకున్న వంశీ చాగంటి ఈ సినిమాలో దేవినేని మురళీ పాత్రలో మెప్పించాడు. అన్న మరణంతో రగిలిపోయే పాత్రలో వంశీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇతర పాత్రల్లో వంశీ నక్కంటి, కౌటిల్య, శ్రీ తేజ్ లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.


 అది కాస్త ఇబ్బందే

అది కాస్త ఇబ్బందే


రక్త చరిత్ర చిత్రంలోలాగానే ..రాంగోపాల్‌ వర్మ తన వాయిస్‌ ఓవర్‌తోనే కథని నడిపించాడు. ప్రతి సీన్ లోనూ ఆయనే కనిపిస్తుంటారు. అసలు కథ కన్నా కథనంపైనే దృష్టి ఎక్కువ పెట్టి.. ఎక్కువగా సీన్స్ నే ఎలివేట్ చేశాడు. టెక్కికల్ గా కూడా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. సంగీతం, ఛాయాగ్రహణం కథ మూడ్‌కి తగ్గట్టుగానే కుదిరాయి. వర్మ మార్క్ సినిమాటోగ్రఫి, నేపథ్య సంగీతం మరోసారి ఆకట్టుకోగా మితిమీరిన రక్తపాతం అక్కడక్కడ ఇబ్బంది పెడుతుంది.


 వంగవీటికి పనిచేసింది వీళ్లే

వంగవీటికి పనిచేసింది వీళ్లే


సంస్థ: శ్రీ రామదూత క్రియేషన్స్‌ ‌,
ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌,
సాహిత్యం: సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌,
సినిమాటోగ్ర‌ఫీ: రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి,
ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్: మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: విస్సు,
కో ప్రొడ్యూస‌ర్: సుధీర్ చంద్ర ప‌డిరి,
సంగీతం: రవిశంకర్‌
ఎడిటర్: సిద్ధార్థ్ తాతోలు,
నిర్మాణం: దాసరి కిరణ్‌కుమార్‌
కథ, కథనం, దర్శకత్వం: రాంగోపాల్‌ వర్మ
విడుదల తేదీ: 23-12-2016
ఫైనల్ గా ...విజయవాడలో అప్పట్లో ఏం జరిగింది అనే విషయమై ఆసక్తి ఉన్న వాళ్ళకు, అప్పటి పరిస్దితుల మీద అవగాహన ఉన్నవాళ్లకు ఇది తప్పనిసరిగా చూడదగ్గ సినిమానే. మిగిలినవాళ్లకు ఓ రొటీన్ వర్మ మార్క్ రివేంజ్ సినిమా చూసినట్లు ఉంటుంది.

English summary
RGV's Vangaveeti movie released today. Here is the review of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X