»   » దాసరి మృతి రూమర్ వెనక ..చిరు ఫ్యాన్ ?

దాసరి మృతి రూమర్ వెనక ..చిరు ఫ్యాన్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : దర్శక రత్న దాసరి నారాయణ రావు చనిపోయినట్లు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో ఆయన ఫ్యాన్స్ కంగారు పడడమే కాక దాసరి ఇంటి వద్ద బారులు తీరారు.

ఈ విషయం తెలుసుకున్న దాసరి తను చనిపోయినట్టు విష ప్రచారం చేసిన వారిని పట్టుకోవాలంటూ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. గత వారం నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో తను మృతి చెందినట్టు ఫోటోలు పెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దాసరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపై వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు, కేసును సైబర్‌ క్రైంకు బదీలీ చేశారు. నిందితుణ్ణి గుర్తించేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Who is behind DASARI death rumour?

అయితే ఇలా దాసరికి ఆరోగ్యం బాగోలేదని , ఆయన చనిపోయారని అప్ లోడ్ చేస్తున్నది ఓ మెగా ఫ్యాన్ అనే వార్తలు వినపడుతున్నాయి. వైజాగ్ లో నివసించే ఈ అభిమాని తమ హీరో సినిమాకు అడ్డుపడతారనే వార్తలు చదివి ఇలాంటి కంటెంట్ ని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసినట్లు పోలీసులు ఫైండవుట్ చేసారని వినిపిస్తోంది. అతన్ని పట్టుకుని కస్టిడీకి పంపారని అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.

ప్రస్తుతం దాసరి నారాయణ...పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరో ప్రక్క మెగాస్టార్ చిరంజీవి 150 చిత్ర కథపై దాసరితో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాద వార్తే ఈ ఫేస్ బుక్ పోస్టింగ్స్ కు కారణమని తెలుస్తోంది.

English summary
If insider sources are to be believed, a Mega fan, a resident of Vizag is going to be taken into custody for posting objectionable hoax content against Dasari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu