»   » పవన్ కొత్త పుస్తకం ‘నేను-మనం-జనం’కు ఘోస్ట్ రైటర్ ఉన్నాడా,నిజమా?

పవన్ కొత్త పుస్తకం ‘నేను-మనం-జనం’కు ఘోస్ట్ రైటర్ ఉన్నాడా,నిజమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu


హైదరాబాద్ : జనసేన సిద్ధాంతాన్ని, ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 'నేను-మనం-జనం'(మార్పుకోసం యుద్ధం)అనే పుస్తకం రాస్తున్నారంటూ జనసేన పార్టీ...పత్రికా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతవరకూ బాగానే ఉంది. ఈ పుస్తకం వార్త ఇలా బయిటకు రాగానే ..ఈ పుస్తకాన్ని నిజంగానే పవన్ రాస్తున్నారా లేక ఘోస్ట్ రైటర్ ఎవరైనా ఉన్నారా అనే టాపిక్ బయిలు దేరింది.

ఇక గతంలో పవన్ విడుదల చేసిన ఇజం పుస్తకాన్ని మాత్రం పవన్ రాయలేదు. దీనిని రాజు రవితేజ్ అని పవన్ మిత్రుడు రాశారు. బుక్ టైటిల్స్లో కూడా రాజు రవితేజ్ పేరు ఉంది. కానీ ఇప్పుడు మాత్రం పొలిటికల్ గా మంచి టర్న్ ఇస్తుందని భావిస్తుండడంతో దీనిని పవనే రాస్తాడని అందరూ అనుకుంటున్నా.... ఇప్పుడు కూడా పవన్ ఘోస్ట్ రైటర్ తోనే ఈ పుస్తకాన్ని రాయిస్తున్నాడని టాక్ మొదలైంది.

ఇంతకీ ఆ ఘోస్ట్ రైటర్ ఎవరూ అంటే...సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో తనకు చాలా నమ్మకంగా పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నే ఘోస్ట్ రైటర్ గా పెట్టుకున్నాడని చెప్తున్నారు. అయితే ఆ అసెస్టెంట్ వివరాలు మాత్రం బయటకు రాలేదు.

Who Is The Ghost Writer For Pawan Kalayan new book?

పవన్ తనేమి అనుకుంటున్నాడో డిక్టేట్ చేస్తే.. ఆ అసెస్టెంట్ పేపర్ పై పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. చాప్టర్స్ వైజ్ పవన్ తన వాయిస్ ను రికార్డర్ లో వినిపిస్తే దానిని పుస్తక రూపంలో ఈయన మారుస్తాడని అంటున్నారు. అయితే ఇదంతా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదే. ఇందులో నిజా నిజాలు ఎంత ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.

ఇక 'పార్టీ పెట్టటం వెనుక ఆయనకున్న ఉద్దేశ్యాన్ని, ప్రేరేపించిన పరిస్థితులను, చేయాలనుకున్న కార్యక్రమాలను, సాధించాలనుకుంటున్న ఆశయాల్ని ప్రతిబింబించేదిగా పుస్తక రచన ఉంటుంది అని చెప్పారు.

అలాగే..ఇంతకుముందు ప్రచురించిన ఇజమ్ పుస్తకం కంటే భిన్నంగా, సరళంగా, సూటిగా ఉండాలనే ప్రయత్నంతో ఈ పుస్తకాన్ని పవన్ ప్రచురిస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో ఈ పుస్తకాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో పార్టీ ఉంది' అని ప్రకటించింది. ఉంది.

English summary
Pawan Kalyan is soon going to write a book on contemporary politics and his political ideology. The book has been titled – “Nenu-Janam-Manam,” with a tagline “Marpu Kosam Yudham” (fight for change). Pawan must have found another ghost writer for his second book. Who is he?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu