»   » అఖిల్ .. 'మిస్సైల్‌' వద్దనుకోవటానికి అదా కారణం?

అఖిల్ .. 'మిస్సైల్‌' వద్దనుకోవటానికి అదా కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటు డాన్స్, అటు ఫైట్స్ విషయంలో అఖిల్ అదరగొడుతున్నాడు సరే... ఇంతకూ సినిమా పేరేమిటి? ఎప్పుడొస్తుందన్నది చెప్పమంటున్నారు అఖిల్ అభిమానులు. అఖిల్‌, వివి వినాయక్‌ కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రానికి టైటిల్ ఎంపిక జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆగస్టు 29 నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అఖిల్‌ సినిమా టీజర్‌ని చూపిస్తారు. అప్పుడే టైటిల్‌ని కూడా ఫిక్స్‌ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈసినిమా కోసం పలు పేర్లు పరిశీలిస్తోంది చిత్ర యూనిట్.

ముఖ్యంగా 'మిస్సైల్‌' అనే టైటిల్‌ అభిమానుల్లో నానుతోంది. ఇప్పుడు 'తాండవం' కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు పేర్లలో ఒకదానికి ఓకే చెప్పే అవకాశాలున్నాయి. అఖిల్‌ తొలి సినిమాకి తెలుగు టైటిల్‌ అయితే బాగుంటందని నాగ్‌ సూచించిన నేపథ్యంలో 'తాండవం' ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏ టైటిల్‌ నిర్ణయిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. అక్టోబర్‌ 21న అఖిల్‌ చిత్రాన్ని విడుదల చేస్తారని టాక్‌.

Why Akil not intrested in Missel title?

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం ద్వారా అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది.

ప్రస్తుతం ఈ చిత్ర టీం సౌత్ ఆఫ్రికాలో సాంగ్స్ మరియు కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో ఉంటుంది. మరో యువ హీరో నితిన్ తండ్రిసుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.


ఇక అక్కినేని అఖిల్ తాజా చిత్రం విశేషాలు ..ట్విట్టర్ సాక్షిగా...ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు. ఓల్డ్ సిటీలో షూటింగ్ ముచ్చట్లు, ఆ మధ్య స్పెయిన్ లో జరిగిన షూటింగ్ వివరాలు కూడా అభిమానులకు తెలిపాడు.

యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akkineni Akhil’s debut film first look teaser on Nagarjuna’s birthday on August, 29th.
Please Wait while comments are loading...