»   »  షాక్ :పవన్ సెట్లో చిరు..అసలు రీజన్ అదా?

షాక్ :పవన్ సెట్లో చిరు..అసలు రీజన్ అదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా... పవన్ ‘సర్దార్‌..' సెట్లో చిరంజీవి అడుగుపెట్టి చిత్ర యూనిట్ ని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. పవన్‌తో కాసేపు ముచ్చటించి సినిమా సంగతుల్ని అడిగి తెలుసుకొన్నారు. యూనిట్‌ సభ్యులతో సరదాగా గడిపి వెళ్లారు. చిరు రాకతో ‘సర్దార్‌..' సెట్‌ హంగామాగా మారింది. అంతేకాదు ఆ ఫొటోలు నెట్ లో వైరల్ లా మారాయి.

అయితే హఠాత్తుగా చిరంజీవి..ఇలా పవన్ ..సెట్ కు వచ్చి కలవటం వెనక కారణం ఏంటనేది మాత్రం హాట్ టాపిక్ గా సిని వర్గాల్లో ,మీడియాలో మారింది. అన్నదమ్ములు కలుసుకోవడం... ఫొటోలు దిగడం మామూలే అందులో అంత రీజన్స్ వెతకాల్సిన పనేముంది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నా..చిరంజీవి రాక వెనక ఓ కారణం ఉందని అంటున్నారు.

చిరంజీవి త్వరలో చేయబోతున్న కత్తి రీమేక్ చిత్రానికి ...దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో నరసింహరావు అనే దర్శక,రచయత ద్వారా కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ తీసుకున్న దర్శకుల సంఘం వారు 24 క్రాప్ట్ ఈ సినిమాకు ఏ విధమైన సహాయసహకారాలు అందిచరాదని ఆర్డర్స్ పాస్ చేసారు. ఈ నేపధ్యంలో సినిమా ఇబ్బందుల్లో పడుతోంది.

Why Chiru went to Pawan Kalyan set?

దాంతో చిరంజీవి దీన్ని సాల్వ్ చేసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగటమే ఈ టూర్ వెనక రీజన్ అంటున్నారు. దాసరికి, పవన్ కు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. పవన్ తో దాసరి ఓ చిత్రం సైతం ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మరో ప్రక్క దాసరితో చిరంజీవికి పొలిటకల్ గా విభేధాలు ఉన్నాయి. వీటిన్నటినీ బేరేజు వేసుకునే తమ్ముడుతో ..దాసరికి చెప్పించటానికి ఇలా చిరు చేసాడన చెప్పుకుంటున్నారు. నిజం ఎలా ఉన్నా... వినటానికి ఈ టాపిక్ మాత్రం చాలా ఆసక్తిగా ఉందంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌ మరార్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. రామ్‌లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఓ ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు.

English summary
Sources say Chiranjeevi's sudden visit to Sardaar Gabbar Singh sets is not a casual visit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu