»   » నయనతార 'బాడీ గార్డ్' అదృష్టం!

నయనతార 'బాడీ గార్డ్' అదృష్టం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయనతారకు తెలుగు రాదనుకుని సెట్స్ లో కొందరు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వదిలారట. ఏమీ ఎరగనట్టు నటించి, వారు అన్ని డైలాగ్స్ వదిలేసిన తర్వాత ఆమె కడిగి పారేసిందట. దాదాపు నాలుగున్నరేళ్ల గ్యాప్‌ తర్వాత తన మాతృభాష మలయాళంలో 'బాడీగార్డ్‌' అనే చిత్రంలో నటించారామె. నయనతార ఆనందానికి ఇదొక కారణం. ప్రస్తుతం చేస్తున్నవి కూడా మంచి చిత్రాలే కావడం మరింత హ్యాపీగా ఉందని నయనతార చెబుతూ - "బాలకృష్ణ సరసన 'సింహా'లో నటిస్తున్నాను.

ఇందులో నాది చాలా మంచి పాత్ర. అలాగే తమిళ చిత్రం 'బాస్‌ ఎన్‌గిర భాస్కరన్‌'లో నటనకు అవకాశం ఉన్న పాత్రని పోషిస్తున్నాను. మలయాళంలో శ్యాంప్రసాద్‌ దర్శకత్వంలో ఓ మంచి సినిమా చేస్తున్నాను. కన్నడంలో ఉపేంద్ర పక్కన హీరోయిన్‌గా మంచి క్యారెక్టర్‌ చేస్తున్నాను. మొత్తం మీద తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడంలో ఒక్కో సినిమాలో నటిస్తున్నాను. ఒకేసారి నాలుగు రకాల భాషల్లో చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది' అన్నారు.

ఇదిలా ఉంటే నయనతారకు తెలుగు అర్థం అవుతుంది. కొంచెం మాట్లాడతారు కూడా. మలయాళం, తమిళ్‌ కూడా బాగా తెలుసు. బెంగళూరులో పుట్టినా కన్నడం తెలియదట. అర్థం చేసుకోగలుగుతారు. అందుకని కన్నడ చిత్రంలో నటించడం పెద్ద ఇబ్బందిగా లేదని అంటున్నారు నయనతార.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu