»   » ఊపిరి: ఆ సీన్లో చెయ్యటం ఇష్టలేకే...ఎన్టీఆర్ వదులుకున్నాడా?

ఊపిరి: ఆ సీన్లో చెయ్యటం ఇష్టలేకే...ఎన్టీఆర్ వదులుకున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కింగ్ నాగార్జున, కార్తిలు నటించిన మల్టీస్టారర్ సినిమా ఊపిరి. పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమై రిలీజైంది. హాలీవుడ్ సినిమా 'అన్ టచబుల్స్' సినిమా అఫిషియల్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో మొదట కార్తి క్యారక్టర్ కు గానీ ఎన్టీఆర్ ను అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ డేట్స్ లేకపోవటంతో సినిమా వదలుకున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే మంచి సినిమా ఎన్టీఆర్ వదులుకున్నాడని ఇప్పుడు అందరూ అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ వదులుకోవటానికి కారణం..నిజానికి డేట్స్ ఖాళీ లేకపోవటం కాదని చెప్తున్నారు.


Also Read: భావోద్వేగాలే...'ఊపిరి' (రివ్యూ)


ఊపిరి లో ఓ కీలకమైన సన్నివేశంలో నాగార్జున కాళ్లకు సాక్స్ లు తొడగాల్సి ఉందని, అలాంటి సీన్స్ తను నటుడుగా చేసినా అభిమానులు జీర్ణించుకోలేరని, అలాగని ఆ సీన్ సినిమాలో తీసేయటానికి లేదని, ఇవన్నీ ఆలోచించే ఎన్టీఆర్ సినిమా వదులుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో విపడుతోంది. ఈ వాదనలో ఎంత నిజముందో కానీ..ఈ విషమయై సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కామెంట్ల యుద్దం జరుగుతోంది.


Why NTR Rejected Oopiri?

టెంపర్, నాన్నకుప్రేమతో లాంటి కథలతో అలరించిన ఎన్టీఆర్ మధ్యలో ఈ మంచి సినిమాను మిస్ చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఎన్టీఆర్ చేయాల్సిన రోల్ లో కార్తీ ఎంత బాగా చేసినా, సినిమా చూస్తున్నంత సేపు ఆ రోల్ లో ఎన్టీఆర్ చేసింటే ఆ కిక్కే వేరుగా ఉండేదని అభిమానులు అంటున్నారు.


ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చిన మల్టీస్టారర్ సినిమాల్లో ఊపిరి సినిమా ఒక్కటే ఇద్దరు హీరోలకు సమానమైన పాత్రలను కలిగిఉంది. అలాంటి సినిమాల్లో నాగ్ కి తోడు ఎన్టీఆర్ కూడా చేసి ఉంటే ఖచ్చితంగా క్లాసిక్ గా మారేదని ఎన్టీఆర్ అభిమానులు చెప్పుతున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ చూసినా ఆయన కూడా అలాగే ఫీల్ అవ్వడం ఖాయం అని చెప్పుకుంటున్నారు.

English summary
NTR decided to drop from ‘Oopiri’ at penultimate hour quoting different reasons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu