twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కావాలనే పవన్ ని తొక్కేసారా!? ప్రభాస్ కోసం పైరవీలు అంటూ టాలీవుడ్ గుస గుసలు

    నంది అవార్డుకు గానూ ఉత్తమ చిత్రంగా మిర్చీ ఎంపిక కావటం చర్చనీయాంశం అవుతోంది బంగారు నంది కోసం ప్రభాస్‌ తరఫున లాబీయింగ్‌ గట్టిగా జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి

    |

    రాష్ట్రాల విభజన తో కొన్నాళ్ళు వాయిదా పడ్ద నందులు ఎట్తకేలకు ప్రకటించబడ్దాయి. అయితే ఈ సారి మాత్రం చాలా వరకు అవార్డులు జ్యూరీ పారదర్శకతపై ప్రశ్నార్ధకాన్ని వేలాడదీసాయి అనిపిస్తోంది. ముఖ్యంగా 2013కి ఉత్తమ నటుడిగా ప్రభాస్‌ని ఎంపిక చేయడం టాలీవుడ్ లోనే పెద్ద డిస్కషన్‌ పాయింట్‌ అయింది. 2013కి గాను ప్రభాస్‌, మహేష్‌ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), పవన్‌కళ్యాణ్‌ (అత్తారింటికి దారేది) ఫ్రంట్‌ రన్నర్స్‌ అని తెలియగానే చాలామందే నొసలు ముడేసారు. మిర్చిలో మరీ నంది అవార్డు వచ్చేంత విషయం ఏముందో ఎవ్వరికీ అర్థం కలేదు.

    జనరల్ గా కమర్షియల్ చిత్రాలకు అవార్డు ఇవ్వడం తక్కువ. క్రిటిక్స్ మెప్పుపొందిన చిత్రాలు అవార్డులకు ఎక్కువగా ఎంపిక అవుతుంటాయి. ఈ పాయింట్ తీసుకుంటే 'మిర్చి' పక్కా కమర్షియల్ ఫార్ముల సినిమా. గొప్ప కధేం కాదు. ఊరి కోసం హీరో నిలబడటం,హీరోయిజం ఎలివేట్ చేసే బిల్డప్పులు, విలన్ ని బకరా చేసి ఆ ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ మనుషుల్ని మార్చేయడం.. ఇదంతా పరమ రొటీన్ వ్యవహారం. స్వయంగా దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్ని అంగీకరించాడు. "మిర్చి కొత్త కధ కాదు. తెలిసిన కధనే కొంచెం డిఫరెంట్ గా చూపించాను" అని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు.

    Why Pawan Got Snubbed for Nandi Awards

    అయితే ప్రభాస్‌ తరఫున లాబీయింగ్‌ గట్టిగా జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి 2 రిలీజ్‌కి ముందు ఇది కూడా ఒక విధంగా పబ్లిసిటీకి పనికి వస్తుందని 'బాహుబలి' బృందం కూడా తలా ఒక మాట వేసారట. ఇక పవన్‌కళ్యాణ్‌ అయితే ఈ లాబీయింగ్‌ లాంటి వాటికి చాలా దూరం. ఎ ప్పుడూ అవార్డుల కోసం లాబీయింగ్‌ చేసి ఎరుగని పవన్‌ కోసం 'అత్తారింటికి దారేది' బృందం ఎవరూ అవార్డు ఇవ్వాలంటూ రిక్వెస్ట్‌ పెట్టుకోలేదు. అత్తారింటికి దారేదిలో పవన్‌ కళ్యాణ్‌ ఎంతో గొప్పగా నటించేసాడని కాదు కానీ, మిర్చితో పోల్చుకుంటే అత్తారింటికి దారేది హీరోకే అన్ని పార్శ్వాలుంటాయి.

    అలాంటి మిర్చికి ఇప్పుడు ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డ్ రావడం గమనార్హమే. అదే ఏడాది వచ్చిన "నా బంగారు తల్లి" సినిమా గురించి చెప్పుకుందాం. దేశ విదేశాల్లో ప్రసంశలు అందుకుందీ సినిమా. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో నేషనల్ అవార్డ్ అందుకుంది. ట్రినిటీ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, ఇండోనేషియన్ ఫిల్మ్ ఫెస్ట్, బీజింగ్ ఇంటర్ నేషనల్, ఏసియన్ పెసిపిక్ స్క్రీన్ అవార్డ్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్ట్, కొల్కత్తా ఇంటర్ నేషనల్.. ఇలా చాలా చోట్ల ఈ సినిమాకి అవార్డులు రివార్డులు దక్కాయి.

    Why Pawan Got Snubbed for Nandi Awards

    అయితే ఇంతటి విశేషం వున్న ఈ సినిమాకి మాత్రం ఉత్తమ రెండో చిత్రంతో సరిపెట్టేశారు నంది కమిటీ సభ్యులు. కమర్షియల్ చిత్రాలు అవార్డులు ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదు. అయితే మిర్చి లాంటి రొటీన్ సినిమాని ఎంపిక చేయడం చర్చకు తావిచ్చింది. ఆ విషయానికి వస్తే.. అదే ఏడాది పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కలయికలో వచ్చిన "అత్తారింటికి దారేది"లో మిర్చి కంటే ఒరిజినల్ కంటెంట్ వుందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. మిర్చికి మించి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది అత్తారింటికి దారేది. మిర్చితో పోలిస్తే హింస కూడా తక్కువే. అయితే ఈ చిత్రాన్ని మాత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం పేరుతో సరిపెట్టేశారు.

    English summary
    A Controversiol Roumer Running over on Tollywood about Nandi award for mirchi that, A senior actor who is also influential in the current ruling Telugu Desam party suggested giving to Prabhas. So, then they have decided to give to Prabhas who is considered non-controversial hero and also his family has affiliation with BJP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X