»   » ఆ విషయంలో ఎందుకని రామ్ చరణ్ పిన్ డ్రాప్ సైలెంట్..!

ఆ విషయంలో ఎందుకని రామ్ చరణ్ పిన్ డ్రాప్ సైలెంట్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ పెళ్లి గురించి మీడియా చిలవలు పలవలుగా రాస్తోంది. ఉపాసనా కామినేనిని ప్రేమించిన చరణ్ ఇరు వైపుల పెద్దల ఆశీస్సుల అందుకుని త్వరలో నిశ్చితార్థానికి సిద్ధపడుతున్నాడని వినిపిస్తోంది. అయితే తన గురించి ఇంత చర్చ జరుగుతున్నా, తన ప్రేమ కథ ఇంతటి రచ్చకి కారణమవుతున్నా కానీ చరణ్ మాత్రం సింపుల్ గా తన సినిమా 'రచ్చ" గురించి మాత్రమే స్పందిస్తున్నాడు. ఫైట్లు అలా ఉటాయి, ఇలా ఉంటాయంటూ రచ్చ గురించి అభిమానుల్ని ఊరిస్తున్న చరణ్ తన ప్రేమ, నిశ్చితార్థం, పెళ్లి గురించి మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఈ వ్యవహారం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్టు, ఇది పూర్తిగా తన వ్యక్తిగతమన్నట్టు చరణ్ ప్రవర్తిస్తున్నాడు.

సహజంగా తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా, ఎవరైనా తనకి బాధ కలిగించినా కసిగా స్పందించే చరణ్ ఈ విషయంలో గుంభనంగా ఉండడం అభిమనుల్ని ఉత్కంఠకి గురి చేస్తోంది..పెళ్లి ఖాయమే అన్నది అర్థమవుతున్నా కానీ చరణ్ అస్సలు అది మీకు అనవసరం అన్నట్టుగానే అభిమానులతో ఆ విషయం గురించి మాట్లాడకపోవడం చిత్రంగా ఉంది. బహుశా పెళ్లి నిశ్చయమయ్యాక దానిపై స్పందిస్తాడేమో. లేదంటే నా పెళ్లితో మీకేం పని అని అస్సలు లెక్కే చేయడేమో!

English summary
We have recently reported that Ram Charan Teja-Upasana Kamineni are getting engaged this November. The audience, who read the news, were very curious to see the couple together and know more about the bride. So, to make his fans happy, Oneindia is now bringing you a picture of the love birds.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu