»   » బాలయ్యకు ఇచ్చినట్లే నాకూ హిట్టిస్తాడు

బాలయ్యకు ఇచ్చినట్లే నాకూ హిట్టిస్తాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బోయపాటి శ్రీను ...బాలయ్యతో ఇచ్చిన హిట్ చిత్రం 'లెజండ్'. ఈ చిత్రం చేయటమే ఇప్పుడు బోయపాటి శ్రీనుకి కలిసొచ్చింది. అందే చిరంజీవి 150వ సినిమాని డైరక్ట్ చేసే అవకాసం ఇప్పిస్తోంది అంటున్నారు సినిమా జనం. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యతో సింహా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి మళ్లీ అదే పరిస్దితుల్లో పడ్డ బాలయ్యకు మరోసారి లెజండ్ తో నిలబెట్టిన బోయపాటి ...తను గ్యాప్ తో చేస్తున్న సినిమా కి కరెక్టు డైరక్టర్ గా చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బోయపాటి శ్రీను కథ చెప్పాడని, అందులో చిరంజీవి మార్పులు, చేర్పులు చెప్పాడని అంటున్నారు. రామ్ చరణ్ తో సినిమా అనుకుంటే అది చిరంజీవి తో సినిమా గా మారింది. అలాగే బోయపాటితో చేయటంతో ప్రాజెక్టుకు కు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

శక్తివంతమైన పాత్ర, మాస్ అప్పీల్ ఉండే కథకి బోయపాటి ఇచ్చే ట్రీట్‌మెంట్‌తో ఆ సినిమా మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువవుతుందనీ, అందువల్ల చిరంజీవి 150వ సినిమాకు బోయపాటి సరిగ్గా సరిపోతాడనీ మెగాభిమానులు భావిస్తున్నారు. అయితే హింస విపరీతంగా ఉంటుదని, చిరంజీవి శైలి వినోదం ఎంతవరకూ పండించగలడని కొందరంటున్నారు.

Will Chiranjeevi Okays Boyapati Film?

మరో ప్రక్క ఈ సినిమా కోసం స్క్రిప్టు తయారు చేయడానికి ఇదివరకే ఆయన పరుచూరి బ్రదర్స్‌ను నియోగించారని సమాచారం. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌వాళ్లని గడగడలాడించిన రాయలసీమ వీరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా ఒక స్క్రిప్టును బ్రదర్స్ సిద్ధం చేశారు. ఈ స్క్రిప్టును చిరంజీవి ఓకే చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్ట్‌లో సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమా 2015 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావచ్చు.

చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా 'శంకర్‌దాదా జిందాబాద్' (2007). ఆ సినిమా ఫ్లాపయినా టాలీవుడ్‌లో అప్పటికి ఆయనే నెంబర్‌వన్. ఆ స్థాయిలో ఉండగానే ఆయన రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో సినిమాలకు తాత్కాలికంగా దూరమయ్యారు. అయితే రాజమౌళి కోరిక మేరకు తన కుమారుడు రామ్‌చరణ్ హీరోగా నటించిన 'మగధీర' (2009)లో చిరంజీవి స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. అంతే! ఆ తర్వాత ఆయన సినిమా కోసం మళ్లీ ఇంతవరకు ముఖానికి రంగేసుకోలేదు. కాకపోతే జె.కె. భారవి రూపొందించిన 'జగద్గురు ఆదిశంకర' (2013) సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు.


English summary
There have been many speculations in the past about who will be directing Chiranjeevi for his long pending 150th film but no Scripts have been okayed so far. Boyapati along with VV Vinayak who has already narrated a few subjects seems to be leading the race as of now.
Please Wait while comments are loading...