»   » బాహుబలి2ని చూడనున్న జస్టిన్ బీబర్!.. ఇండియాలో పాప్ సెన్సేషన్ విశేషాలు ఇవే..

బాహుబలి2ని చూడనున్న జస్టిన్ బీబర్!.. ఇండియాలో పాప్ సెన్సేషన్ విశేషాలు ఇవే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంటర్నేషనల్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ భారత్‌లో అడుగుపెట్టాడు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో తన మంది మార్భలంతో కలినా ఎయిర్‌పోర్ట్‌లో కాలుమోపాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి బీబర్ బస చేసే హోటల్ వరకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా తోడ్కొని వెళ్లడం విశేషం. మే 6 తేదీన దుబాయ్‌లో తన ఈవెంట్‌ను బీబర్ ముగించుకొని బుధవారం (మే 10) తేదీన నిర్వహించే సంగీత కచేరీ కోసం ముంబైకి రావడం గమనార్హం.

బాహుబలిని చూసే..

బాహుబలిని చూసే..

భారత పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న బాహుబలి2 చిత్రాన్ని చూసే అవకాశం ఉందే వార్త బలంగా వినిపిస్తున్నది. ప్రస్తుతం బాహుబలి2పై అంతటా చర్చ జరుగుతున్నందున్న ఈ సినిమాను చూడటానికి ఏర్పాట్లు చేస్తున్నారనే రూమర్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. బీబర్ సినిమా ప్రియుడే. ఆయనకు రాకీ, ది నోట్‌బుక్ చాలా ఇష్టమైన చిత్రాలు.


ముంబై డీవై పాటిల్ స్టేడియంలో..

ముంబై డీవై పాటిల్ స్టేడియంలో..

ఈ రోజు (బుధవారం) రాత్రి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నిర్వహించే మ్యూజిక్ ఈవెంట్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 45 వేల మంది సంగీతప్రియులు హాజరయ్యే అవకాశం ఉంది. భారత్‌లో బీబర్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈవెంట్‌ను నవీ ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 500 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. 25 మంది ఉన్నతాధికారులు స్టేడియం వద్ద విధుల్లో నిమగ్నమయ్యారు. నిరంతరం భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలను ఏర్పాట్లు చేశారు.


బీబర్ బృందంలో..

బీబర్ బృందంలో..

బీబర్ బృందంలో మ్యూజిక్ రంగంలో పాపులర్ అయిన డీజే స్టార్టెక్, డీజే జేడెన్, న్వార్వేకి చెందిన డీజే అలన్ వాకర్ ఉన్నారు. బుధవారం 4 గంటలకే డీజే స్టార్టెక్ కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజులపాటు న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలోని చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తారు.


అరుదైన బహుమతులు..

అరుదైన బహుమతులు..

ఈ పర్యటనలో భారతీయ ప్రముఖులు అందించే అరుదైన బహుమతులు అందుకోనున్నారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ ఆటోగ్రాఫ్ చేసి సరోద్ వాయిద్యాన్ని బీబర్‌కు అందించనున్నారు. క్రిస్టల్స్‌తో చేసిన జాకెట్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ బహుకరించనున్నారు. బీబర్ తల్లి పెట్టి మల్లెట్ కోసం చందేరి సిల్క్ జాకెట్‌ను అనామిక ఖన్నా డిజైన్ చేశారు.


జాక్వెలినా ఫెర్నాండేజ్

జాక్వెలినా ఫెర్నాండేజ్

ముంబై పర్యటనలో బాలీవుడ్ తార జాక్వెలినా ఫెర్నాండేజ్‌ తోడుగా ఉంటారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, కాలా గోడా ప్రాంతాలను జాక్వెలినా ఫెర్నాండేజ్ స్వయంగా చూపించనున్నారు. బీబర్‌కు ముంబైని పరిచయం చేసే అవకాశం జాక్వెలినా ఫెర్నాండేజ్ దక్కించుకొన్నారు.


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురు బీబర్ ఫ్యాన్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురు బీబర్ ఫ్యాన్

ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా యువతకు పాప్ సింగర్ జస్టిన బీబర్ అంటే ఎంతో ఇష్టం. బాలీవుడ్ సూపర్ స్టార్ పిల్లలు కూడా ఆయనకు ఫ్యానే. బీబర్ ఫ్యాన్ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఉన్నారు. గతంలో బీబర్‌తో దిగిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. బుధవారం (మే 10) జరిగే బీబర్ ఈవెంట్‌కు సారా హాజరవుతుండటం గమనార్హం.English summary
A big question remains; will Justin Bieber catch a screening of the global phenomenon Baahubali 2: The Conclusion? Directed by SS Rajamouli, Baahubali 2: The Conclusion. Justin Bieber will also take a tour of Mumbai and visit iconic places like the Gateway of India and Kala Ghoda with actor Jacqueline Fernandez being his special hand-picked desi guide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu