రామ్ చరణ్ ‘ఎవడు’ కొత్త విడుదల తేదీ
హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం జులై 31న విడుదల కావాల్సి ఉంది. అయితే రకరకాల కారణాలతో ఈ చిత్రం విడుదల చేయటం లేదని నిర్మాత ప్రకటన చేసారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'ఎవడు' విడుదల తేదీ ని అక్టోబర్ 4 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లోగా రాష్ట్రంలో ఉన్న అనిశ్చితి సర్దుకుంటుందని భావిస్తున్నారు. అలాగే ఈ మద్యలో రామ్ చరణ్ నటించిన హిందీ చిత్రం తుఫాను సెప్టెంబర్ 6 న విడుదల అవుతుంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే.
మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
'ఎవడు' త్వరలో విడుదలవుతుంది. అల్లు అర్జున్‌కి జంటగా నటిస్తున్నాను. ఇందులో నాది చిన్న పాత్రే అయినా బాగుంటుంది. కథలో నా పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత సినిమాలో వచ్చే మార్పులు కీలకమని కాజల్ చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఎవడు చిత్రంలో ఆమె అల్లు అర్జున్ సరసన చేస్తోంది. గెస్ట్ రోల్ కోసం ఈ చిత్రంలో ఆమెను తీసుకున్నారు. ఆమె పాత్ర నచ్చి, చిన్నదైనా చేసానని చెప్తోంది.


Click it and Unblock the Notifications












