ప్రభాస్‌కు తేజ సజ్జా షాక్.. మరోసారి డార్లింగ్‌ను సవాల్ చేస్తున్న యంగ్ హీరో!
యంగ్ హీరో తేజా సజ్జా ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ సెన్సేషనల్ గా మారుతున్నారు. తన చిత్రాలతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సూపర్ హీరో ఫిల్మ్ హను-మ్యాన్ తో ఎంతంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. కాగా ఈ చిత్రం గతేడాది 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్ల గ్రాస్ వసూల్ చేసి సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు తేజా సజ్జా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మిరాయ్ (Mirai)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ గా మిరాయ్ రూపుదిద్దుకుంది. మల్టీలింగ్వుల్‌గా మిరాయ్ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 2025 సెప్టెంబర్ 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠి, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా ఆగస్టు 28న విడుదల చేశారు. ట్రైలర్ కట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఉంది. ముఖ్యంగా విజువల్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్, యాక్షన్ పరంగా సినిమా అద్భుతంగా ఉంటుందని ట్రైలర్ హామీనిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొన్నాయి.

కాగా, తేజా సజ్జా నటించిన మిరాయ్ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్ లోకి రావడంతో ప్రభాస్ రాబోయే చిత్రం ది రాజా సాబ్ గురించి కూడా సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం కూడా ఉంది. ప్రభాస్ హిందీలో నటించిన ఆదిపురుష్ చిత్రం, తేజా సజ్జా నటించిన హను-మ్యాన్ చిత్రం 6 నెలల తేడాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి ఆదిపురుష్ 2023 జూన్ 16న విడుదలై ప్రేక్షకుల నుంచి విమర్శలను అందుకుంది. ముఖ్యంగా విజువల్స్ పరంగా తీవ్ర నిరాశ పరిచింది. ఆ వెంటనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజా సజ్జా హను-మ్యాన్ మాత్రం విజువల్స్ పరంగా అద్భుతం అనిపించింది. ఈ రెండు చిత్రాల్లో శ్రీరాముడు, హనుమాన్ లను చూపించిన విధానం ఆకాశానికి భూమికి ఉన్న తేడా అని అభిప్రాయాలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఓకే బ్యానర్ లో ప్రభాస్, తేజా సజ్జాల సినిమాలు వస్తుండటం విశేషం. ప్రభాస్ తో తేజా సజ్జాకు పోలిక లేకున్నా.. ప్రభాస్ కు పోటీనిచ్చేలా తేజా సజ్జా చిత్రాలు కనిపిస్తున్నాయని సినీ ప్రముఖులు అంటున్నారు. ఈసారి ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం, తేజా సజ్జా నటించిన మిరాయ్ చిత్రాలు పీపుల్ మీడియా బ్యానర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ క్రమంలో తేజా సజ్జాకు, ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రానికి విజువల్స్ పరంగా పోటీ వాతావరణం కనిపిస్తోందని తెలుపుతున్నారు. ఇప్పటికే ది రాజా సాబ్ టీజర్ లో ప్రభాస్ లుక్ పై స్వల్పపాటి ట్రోల్ కనిపించింది. మిరాయ్ ట్రైలర్ మాత్రం నెక్ట్స్ లెవల్ అంటున్నారు. ఇలా ఈసారి కూడా డార్లింగ్ కు తేజా సజ్జా షాక్ ఇవ్వబోతున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











