రవితేజ చేయాల్సిన సినిమాలో మెగా హీరో... ఆ హిట్ దర్శకుడితో గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడుగా
సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఒకరితో అనుకున్న కథ మరొకరికి వెళ్లడం సహజమే. కొన్నిసార్లు ఆ కథలు ప్లాప్ అవ్వచ్చు లేదా నెవ్వర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ హిట్ గా కూడా నిలవవచ్చు. ఇక ఈ లాక్ డౌన్ లో అలాంటి మార్పులు చాలానే జరుగుతున్నాయి. ఒకరు ఒప్పుకున్న సినిమా సడన్ గా క్యాన్సిల్ అవుతుండడంతో మరొక హీరోకు వెళుతున్నాయి. రవితేజ చేయాల్సిన సినిమా కూడా మరొక మెగాహీరో చేయబోతున్నట్లు సమాచారం.

గతంలో కంటే ఎక్కువ ఆఫర్స్
మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో ఈ ఏడాది మొదట్లోనే బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా హిట్టవ్వడంతో గతంలో కంటే ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ మాస్ రాజా తొందరపడకుండా చాలా నెమ్మదిగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అదే విధంగా అంతకుముందు ఓకే చేసిన కథలపై అనుమానం ఉంటే వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. కానీ..
క్రాక్ సినిమా చేస్తున్న సమయంలోనే రవితేజ ఖిలాడి సినిమాతో పాటు మరొక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమా చూపిస్త మామా, నేను లోకల్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న త్రినాథరావు నక్కినతో ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఖిలాడితో పాటు ఆ సినిమాను కూడా మొదలుపెట్టాలని అనుకున్నారు.

మెగా హీరో వైవు తిరిగిన కథ
అయితే లాక్ డౌన్ పడిన తరువాత మాస్ రాజా ఎందుకో ఆ సినిమాపై మనసు మార్చుకున్నాడు. బిజీగా ఉండడం వలన చేయలేకపోతున్నట్లు కారణం చెప్పినట్లు కథనాలు అయితే వస్తున్నాయి. ఇక ఆ కథ మెగా కాంపౌండ్ వైపు యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రినాథరావు స్టోరీ లైన్ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది.

వరుణ్ తేజ్ ఫిక్స్..?
ఆ మెగా హీరో మరెవరో కాదు. వరుణ్ తేజ్. త్రినాథరావు చాలా వరకు సేఫ్ జోన్ లో సక్సెస్ ఫార్ములాను ఉపయోగించి హిట్స్ అందుకుంటారు. ఇక వరుణ్ తేజ్ ఆ దర్శకుడు చెప్పిన కథను విని సింగిల్ సిట్టింగ్ లో ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్, గని సినిమాతో పాటు, F3 మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











