twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్తగా ఉంది: జుంబా ట్రైనింగ్ తీసుకుంటున్న చిరంజీవి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి ఈ చిత్రంలో స్లిమ్ లుక్ లో కనిపించబోతున్నారు. 60 ఏళ్ల చిరంజీవి చాలా తక్కువ వయసున్న వ్యక్తిలా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి తెరపై కనిపించే ఆల్ట్రీ స్టైలిష్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతారని టాక్.

    చిరంజీవికి కాబోయే అల్లుడిపై షాకింగ్ రూమర్స్?

    చిరంజీవి లుక్ విషయంలో దర్శకుడు వివి వినాయక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చిరంజీవి ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఇందులో భాగంగా చిరంజీవికి జుంబా ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు టాక్. జుంబా అనేది కొత్త తరహా ఎరోబిక్ అండ్ డాన్స్ ఎక్సర్ సైజ్. చిరంజీవికి జుంబా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ట్రైనర్ ను నియమించారట. దీని వల్ల వెయిట్ తగ్గడంతో పాటు, చురుకుగా తయారవుతారని.... డాన్స్ మూమెంట్లలో స్పీడప్ పెరుగుతుందని అంటున్నారు.

    'సర్దార్ గబ్బర్ సింగ్' సెట్లో చిరంజీవి (ఫోటోస్)

    Zumba Training for Chiranjeevi

    తమిళంలో హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లొ తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కత్తి చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా చిరంజీవితో చేస్తున్ తెలుగు వెర్షన్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది.

    రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగినా.... సినిమా మళ్లీ వాయిదా పడక తప్పడం లేదు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఇటీవలే సెట్టయింది. ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో పెళ్లి హడావుడి కూడా మొదలైంది. మార్చి 28న వివాహ ముహూర్తం నిశ్చయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవి 150వ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

    English summary
    Chiranjeevi to Undergo a Zumba Training for His 150th Film. Zumba is a new age exercise and the combination of Aerobics and Dance, which helps for weight loss and increases flexibility.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X