twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లేడుతో నిజంగానే హీరో గోపిచంద్ ముక్కు కోశాడట.. పెరుగన్నం మొత్తం రక్తమే..

    |

    మొదట హీరోగా ప్రయత్నాలు చేసి ఆ తర్వాత విలన్ గా గుర్తింపును అందుకుని మళ్ళీ హీరోగా అడుగులు వేసి సక్సెసైన అతి కొద్దిమంది నటుల్లో గోపీచంద్ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న గోపీచంద్ ఈసారి పక్కా కమర్షియల్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నా గోపీచంద్ ఇటీవల ఎవరికీ తెలియని ఒక విషయం గురించి తెలియజేశాడు. తన ముక్కు పై బ్లేడుతో తో జరిగిన దాడి గురించి కూడా వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    మొదటి సినిమా ఫ్లాప్

    మొదటి సినిమా ఫ్లాప్


    గోపీచంద్ మొదట హీరోగా గుర్తింపు అందుకోవడానికి తొలివలపు అనే సినిమాలో నటించాడు. సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత గోపీచంద్ కు అవకాశాలు రాకపోవడంతో చిన్న తరహా పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమయ్యాడు. అయితే దర్శకుడు తేజ గోపీచంద్ ను చూసి విలన్ గా చేస్తావా అని అడగడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు.

     ఒక్కడు సినిమా ఛాన్స్ మిస్

    ఒక్కడు సినిమా ఛాన్స్ మిస్

    నితిన్ నటించిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించే అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం తెలిసిందే. ఒక విధంగా హీరో కంటే కూడా గోపీచంద్ విలన్ క్యారెక్టర్ కు మంచి గుర్తింపు లభించింది. తర్వాత నిజం వర్షం సినిమాలో కూడా గోపీచంద్ విలన్ గా నటించి ఇండస్ట్రీలో మరింత గుర్తింపు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఒక్కడు సినిమాలో కూడా అతనికి విలన్ గా చేసే అవకాశం వచ్చింది. కానీ అంతకుముందే నిజం సినిమాలో మహేష్ బాబు కు విలన్ గా కనిపించారు కాబట్టి మళ్ళీ ఒకే తరహాలో ఉంటే బాగుండేదని దర్శకుడు ప్లాన్ చేంజ్ చేయించడంతో గోపీచంద్ ఆ సినిమాలో విలన్ గా కనిపించలేకపోయాడు.

    చేదు అనుభవాలు

    చేదు అనుభవాలు


    ఇక తర్వాత యజ్ఞం, లక్ష్యం, రణం, శౌర్యం, సాహసం, లౌక్యం ఇలా విభిన్నమైన సినిమాలతో గోపీచంద్ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే అతని సినీ జీవితం కంటే ముందు వ్యక్తిగత జీవితంలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయిన గోపీచంద్ ఆ తర్వాత విదేశాల్లో చదువుకుంటున్న సమయంలో తన సోదరుడిని కూడా యాక్సిడెంట్ లో కోల్పోయాడు. చివరికి తన సోదరుడు అంత్యక్రియలకు కూడా గోపీచంద్ పాల్గొనలేదు.

    బ్లేడుతో అలా..

    బ్లేడుతో అలా..

    గోపీచంద్ తండ్రి టి.కృష్ణ కొన్ని అభ్యుదయ భావాలున్న సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక తండ్రి సన్నిహితుల ద్వారా గోపీచంద్ ఇండస్ట్రీలో కొంత మంది సహకారంతో అవకాశాలు అందుకుని ఇప్పుడు మంచి మాస్ హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ తన చిన్నతనంలోనే ఒక బ్లేడ్ దాడి గురించి ఎవరూ ఊహించని విధంగా వివరణ ఇచ్చాడు.

     బ్లేడుతో కోసి..

    బ్లేడుతో కోసి..

    తన సోదరుడు ముక్కు కోసి పప్పులో వేస్తా అనే సామెతను సరదాగా చేసి చూపించాలని అనుకున్నాడట. అలా చేస్తే ఎలా ఉంటుంది గోపి గోపీచంద్ తో ఒకసారి అన్నాడట. అప్పుడే గోపీచంద్ పెరుగన్నం పెట్టుకొని తింటున్నాడు. ఇక బ్లేడుతో అతని సోదరుడు హఠాత్తుగా ముక్కుపై కో చేశాడట. దీంతో ఒక్కసారిగా రక్తం కారిపోయి పెరుగన్నం మొత్తం రక్తపు అన్నంగా మారిపోయిందిని ఆ తర్వాత మా నాన్న కు భయపడే అన్నయ్య మా బంధువుల ఇంటికి పారిపోయాడు అని గోపి వివరణ ఇచ్చాడు. అందుకే ఆ గాయం నా ముక్కుపై ఇంకా అలానే ఉంది అని దాన్ని సర్జరీ చేయించుకోవాలని కూడా అనుకోలేదని అంటూ.. మా అన్నయ్య గుర్తు కోసం అలా ఉంచుకున్నాను అని గోపీచంద్ తెలియజేశాడు.

    English summary
    Actor gopichand about his childhood blade attack
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X