Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కైకాల సత్యనారాయణ చనిపోవడానికి అసలు కారణం.. అంత్యక్రియలు ఆలస్యంగానే..: కైకాల సోదరుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూయడం ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరిని షాక్ కు గురి చేసింది. నటనతో ప్రతి తెలుగు ప్రేక్షకుడిలో కూడా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆయన హఠాత్తుగా కన్నుమూయడం తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే కైకాల సత్యనారాయణ చనిపోవడానికి కారణం ఏమిటి అనే విషయంలో కూడా అనేక రకాలు కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఆయన అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయనే విషయం గురించి కూడా సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఈ క్రమంలో కైకాల సత్యనారాయణ సోదరుడు ప్రత్యేకంగా మీడియాకు ఇచ్చిన వివరణలో ఆ విషయాలపై పై క్లారిటీ ఇచ్చాడు.. ఆ వివరాల్లోకి వెళితే..

60 ఏళ్ళ సినీ ప్రయాణం
1935 జూలై 25 వ తేదీన జన్మించిన కైకల సత్యనారాయణ 1959లో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక తన 60 ఏళ్ళ కెరీర్ లో ఆయన మొత్తంగా 750 కి పైగా సినిమాల్లో నటించారు. ఆతరం నటీనటుల నుంచి నేటి తరం యువ హీరోల వరకు ఆయన అందరితోనూ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఎనలేని గుర్తింపును అందుకున్నారు. ఇక ఆయన 87 సంవత్సరాల వయసులో కన్నుమూయడం తీరని విషాదాన్ని మిగిల్చింది.

యాక్టింగ్ లో ఆల్ రౌండర్
కైకాల సత్యనారాయణ 1959లో సిపాయి కూతురు అనే సినిమా ద్వారా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మొదట్లో అయినా రామారావు లాగా ఉన్నారు అని విధంగా గుర్తింపు కూడా అందుకున్నారు. విలన్ పాత్రలు చేస్తూ అలాగే కామెడీ పాత్రలు కూడా ఎన్నో చేశారు. అంతేకాకుండా మంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా చేసి ఏ పాత్ర కైనా సరే న్యాయం చేయగలరు అని నిరూపించుకున్నారు. ఇక 2003 వరకు కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా కొనసాగారు. కానీ 2005 తర్వాత మళ్లీ ఆయన సినిమాలు తగ్గించేశారు.

చివరి సినిమా
కైకల సత్యనారాయణ చివరగా 2019లో మహర్షి సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే తాత గారి పాత్రలో ఒక చిన్న సన్నివేశంలో కనిపించారు. ఇక తర్వాత ఆయన కొంత అనారోగ్యానికి గురి కావడం వలన మళ్లీ సినిమాలు చేయలేదు. అలాగే వయసు కూడా ఎక్కువగా కావడంతో ఆయన ఏ సినిమా వేడుకలకు హాజరు కాలేదు. అలాగే ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళని పరిస్థితి ఏర్పడింది.

మరణానికి కారణం
ఇక కైకల సత్యనారాయణ ఎలా మరణించాడు అనే విషయాలపై అనేక రకాల కథనాలు వెలువడుతున్న సమయంలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు ఒకరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు ఆయన కన్నుమూశారు అని వయోభారం అనారోగ్య సమస్యల వలన ఆయన మృతి చెందారు. దాదాపు ఆరు నెలల నుంచి కూడా ఇంట్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. కోవిడ్ టైంలో కూడా ఆయన ఎక్కువగా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది.. అని అన్నారు.

శనివారం అంత్యక్రియలు
ఇక కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం రోజు మహాప్రస్థానంలో జరగనున్నాయి. వారి కుటుంబ సభ్యులకు కొంతమంది చెన్నైలో ఉన్నారు. వారు సాయంత్రం లోపు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక అందరూ వచ్చిన తర్వాత రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.. అప్పటివరకు ఎవరైనా కడసారి చూడాలంటే వారి ఇంటికి రావాలి.. అని ఆయన సోదరుడు నాగేశ్వరరావు తెలియజేశారు.