twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇస్తావా.. లేదా కారులోంచి దుకేస్తా అన్నాను.. అంత కోపం ఉండేది: కళ్యాణ్ రామ్

    |

    నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నెక్స్ట్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యాడు. ఇక రెగ్యులర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కళ్యాణ్ రామ్ గతంలో వచ్చిన తన కోపం గురించి కూడా బయటపెట్టాడు. ఒకసారి కారులో ఉండగానే బెదిరించిన విషయాన్ని కూడా కళ్యాణ్ రామ్ తెలియజేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..

    నటుడిగా తెరపైకి రాకముందు చిన్నప్పుడు నాకు చాలా కోపం ఉండేది. ప్రతీ చిన్న విషయంలో కూడా నాకు ఒక ఆవేశం ఉండేది. కొన్నాళ్ళు అది మరింత ఎక్కువయ్యింది. స్కూల్ లో నేను చదువుకుంటున్న సమయంలో కూడా చాలా చిరాకు పడేవాన్ని. ఆ విషయంలో నన్ను చూసి అందరూ కూడా చాలా కంగారు పడ్డారు.. అని కళ్యాణ్ రామ్ తెలియజేశాడు.

     డ్రైవింగ్ అంటే ఇష్టం..

    డ్రైవింగ్ అంటే ఇష్టం..

    ఇక ఒకానొక సమయంలో కోపం తీవ్ర స్థాయిలో ఉదృతం అయినప్పుడు మాత్రం పట్టు విడవకుండా ఉండేవాడిని. నాకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. 13 ఏళ్ళ వయసులోనే నేను కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను. మా అన్నయ్య నాన్న గారితో పాటు నాకు కారు నడపడం అంటేనే ఎంతగానో ఇష్టం ఉండేది. అలాగే తమ్ముడు ఎన్టీఆర్ కు కూడా డ్రైవింగ్ ఇష్టమని కళ్యాణ్ రామ్ అన్నారు.

    కారులో నుంచి దుకాలా..

    కారులో నుంచి దుకాలా..

    అయితే ఒకానొక సమయంలో కారు నడుపుతూ బయటకు వెళ్లినప్పుడు మా పెదనాన్న ఒకరు నన్ను కారు నడపవద్దు అన్నారు. ఇక కొద్దీ సేపటికి కారు రన్నింగ్ లో ఉండగానే కారు డ్రైవింగ్ ఇస్తారా లేదా కారు లోంచి దూకేయలా అని డోర్ తీశాను. అంతలా నా ఆవేశం ఉండేది అనుకున్నది జరగాల్సిందే అని మొండి పట్టుదలతో ఉండేవాడిని.. అని కళ్యాణ్ రామ్ చెప్పాడు.

    దండం పెట్టేసి

    దండం పెట్టేసి

    ఇక కారు నడుపుతున్న సమయంలో మా పెదనాన్న నా గోల చూడలేక దండం పెట్టేసి కారు నా చేతుల్లో పెట్టేశారు. మా పెద్దమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా నన్ను చూసి షాక్ అయ్యేవారు. ఇక ఆ తరువాత కొన్నాళ్ళకు మా బాబాయ్ బాలకృష్ణ నన్ను చూసి సినిమాల్లోకి వీడిని నేనే పరిచయం చేస్తానని అన్నారు. అన్నట్లుగానే ఆయన తన సినిమాలో బాల నటుడిగా నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

    కోపం తగ్గడానికి కారణం

    కోపం తగ్గడానికి కారణం

    ఇక కొన్నాళ్ళకు నాలో ఉన్న ఆవేశం కోపం తగ్గడానికి ఒక కారణం ఉంది. మా స్కూల్ టీచర్ ఒకసారి నీకు ఏం చూసుకొని అంత పొగరు అని అన్నారు. అసలు నందమూరి అనే పేరు లేకపోతే నీ పేరుకు ఎలాంటి అర్థం ఉండేది అని ప్రశ్నించారు. అతను అలా ఆడిగేసరికి నాలో ఒక ఆలోచన వచ్చింది. నిజమే కదా అనుకున్నాను. అలాగే నీ వెనక మీ తాత గారి బ్రాండ్ ఉంది కాబట్టి మంచి చేసినా చెడు చేసినా ప్రభావం ఉంటుంది అని అన్నారు. అందుకే అప్పటి నుంచి ఒక్కసారిగా నేను పూర్తిగా చేంజ్ అయ్యాను అని కళ్యాణ్ రామ్ తెలియజేశాడు.

    English summary
    Actor Nandamuri kalyan ram about his aggression in childhood
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X