విడాకులు అయిన పధ్నాలుగేళ్ల తర్వాత పెళ్లికి సిద్ధమైన స్టార్ యాక్టర్.. అమ్మాయి ఎవరంటే?
సినీ పరిశ్రమ అనే కాదు ఎక్కడ చూసినా ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకోవడం నచ్చకపోతే విడి పోవడం అనేది చాలా కామన్ అయి పోయింది. కాకపోతే సినిమా వాళ్ల మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది కాబట్టి వారు ఏం చేసినా అది వార్తల్లోకి ఎక్కుతూనే ఉంటుంది. తాజాగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరో ఇప్పుడు మరో సారి పెళ్లి పీటలేక్కేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మరెవరో కాదు కోలీవుడ్ సీనియర్ హీరో ప్రశాంత్. ఇప్పటికే విడాకులు తీసుకుని వేరుగా జీవిస్తున్న ఆయన మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

సినీ వారసుడిగా
ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అయిన ప్రశాంత్ కు తమిళ్ లో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. నిర్మాత త్యాగరాజన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ చాలా తక్కువ టైమ్ లోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా ఆయన శంకర్ డైరెక్షన్ లో డ్యూయల్ రోల్ చేసిన జీన్స్ సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ మూవీగా సౌత్ ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి
ఈసినిమాతో ప్రశాంత్ కెరీర్ ఒక్కసారిగా పైకి లేచింది. ఆ తరువాత మంచి సినిమాలు ఎంచుకోక పోవడంతో ఆయనకు సినిమాలు అవకాశాలు తగ్గిపోయాయి.. ఈ క్రమంలోనే చాలా కాలం స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు ప్రశాంత్. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తిన ప్రశాంత్ తెలుగులో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ అన్న పాత్రలో కనిపించాడు.

ప్లాన్ బెడిసికొట్టింది
బోయపాటి శ్రీను దక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తనకు సెకండ్ ఇన్నింగ్స్ బావుంటాయని ప్రశాంత్ భావించాడు కానీ అది బెడిసికొట్టింది. అయితే ఒకప్పుడు హీరో అయినా ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్ లు చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు ప్రశాంత్. ఒక్క తమిళం వరకే పరిమితం కాకుండా తెలుగు కన్నడ మలయాళ హిందీ భాషల్లో పాత్ర మంచిదయితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆమెతో వివాహం
అయితే అనూహ్యంగా ఇప్పుడు ప్రశాంత రెండో సారి వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటూ తమిళ మీడియాలో ప్రచారం మొదలైంది. తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఆయన 2005 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అయిన గృహలక్ష్మి అనే యువతిని వివాహం ఆడారు. తర్వాత మూడేళ్ల పాటు కలిసి కాపురం చేశారు వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు.
Recommended Video


రెండో పెళ్లికి సిద్ధం
మూడేళ్ల తర్వాత కలిసి కాపురం చేయలేము అని నిర్ణయం తీసుకున్న వీరిద్దరూ న్యాయపరంగా విడాకులు తీసుకొని వేరుగా జీవిస్తున్నారు. అప్పటి నుంచి అంటే దాదాపు 14 ఏళ్లకు పైగా ప్రశాంత్ ఒంటరి జీవితమే గడుపుతున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తన కుటుంబానికి పరిచయం ఉన్న ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్టు తమిళ్ మీడియా వర్గాలలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











