రణ్‌వీర్ సింగ్ గ్యారేజ్‌లో మరో ఖరీదైన కారు.. తనకు తానే గిఫ్ట్.. కళ్లు చెదిరేలా కారు ఖరీదు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు మార్కెట్‌లోకి వచ్చే కొత్త కార్లు, విలాసవంతమైన వాహనాలను కొనే అలవాటు ఎక్కువగానే ఉంది. ఆయన కార్ల కలెక్షన్లలో ఖరీదైన కార్లే ఉన్నాయి. ఇటీవల అంటే జూలై 6వ తేదీన 26వ బర్త్ డేను జరుపుకొన్న ఆయన తన కార్ల ఖాతాలోకి మరో విలాసవంతమైన వాహనాన్ని చేర్చారు. తన పుట్టిన రోజున తనకు తానే మెర్సిడెజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చుకొన్నారు. ఈ కారు ఖరీదు రూ.2.43 కోట్లు. ప్రస్తుతం ఈ కారు కొనుగోలు విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

తాజాగా రణ్‌వీర్ కొనుగోలు చేసిన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోలు చేసిన తర్వాత ఆ కార్ల డీలర్ ఆటో హంగర్ ట్వీట్ చేసింది. రణ్‌వీర్ సింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అలాగే మెర్సిడెజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కారును కొనుగోలు చేసినందుకు శుభాకాంక్షలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Actor Ranveer Singh buys Mercedes Maybach GLS 600 car after Lamborghini Urus

రణ్‌వీర్ సింగ్ కొనుగోలు చేసిన మెర్సిడెజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కారు బ్లూ కలర్‌లో మరింత ఆకర్షణీయంగా ఆకట్టుకొంటున్నది. ఈ కారులో ఉడెన్ ఎన్స్‌ర్ట్స్ ఉండటం ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. 12.3 ఇంచులు కలిగిన ఎంబీయూఎక్స్‌ ఇంటర్‌పేస్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్‌ ఉంది. అలాగే 12.3 ఇంచులు డిజిటల్ ఇన్స్‌ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ సీట్లను ఈ కారు కలిగి ఉంది. ముందు, వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్లు ఉండటం మరింత ఆకర్షణీయంగా మారింది. కారు స్టార్ట్ అయిన 5 సెకన్లలోపే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకొనే కెపాసిటీ ఈ కారు మరో ప్రత్యేకత.

ఇక రణ్‌వీర్ సింగ్ కొద్ది నెలల క్రితం మరో ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. సుమారు రూ.3.15 కోట్లు వెచ్చించి లాంబోర్గిని ఉర్స్ పర్ల్ కాప్యూల్ డిజైన్ ఎడిషన్ కారును కొనుగోలు చేశారు.

ఇదిలా ఉండగా, నటుడు సోను సూద్ తన కుమారుడు ఇషాంత్ బర్త్ డే సందర్భంగా మెర్సిడెజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఈ మెర్సిడెజ్ బెంజ్ కారుకు సంబంధించిన వీడియో య్యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. తన ఇంటికి తీసుకొచ్చిన కొత్త కారును కుటుంబ సభ్యులతో ట్రయల్ రన్‌కు వెళ్లడం వీడియోలో కనిపించింది. సోను సొంతం చేసుకొన్న ఈ వాహనం బ్లాక్ కలర్‌లో ఆకర్షణీయంగా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X